Sri Rama Navami: శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి బావిలో పడిపోయిన 25 మంది భక్తులు
శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది వేళ మధ్యప్రదేశ్ఇండోర్ స్నేహ్ నగర్ పటేల్ నగర్ శ్రీ బోలేశ్వర్ మహాదేవ్ ఝూలేలాల్ మందిరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో ప్రధాని మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. మరోవైపు కలెక్టర్, కమిషనర్లతో మాట్లాడిన చౌహాన్ ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
అసలు వివరాలలోకి వెళ్ళితేమధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లోని స్నేహ్ నగర్ పటేల్ నగర్ శ్రీ బోలేశ్వర్ మహాదేవ్ ఝూలేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యాయి. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైకప్పుపై కూర్చున్నారు.
అయితే మందిరం పైకప్పు కూలిపోయింది. దీంతో భక్తులు బావిలో పడిపోయారు. కనీసం 25 మంది భక్తులు బావిలో పడిపోగా పదిమందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
నిచ్చెన సాయంతో భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. 15 మందిని కాపాడారు. ఆరుగురు చనిపోయినట్లుగా అధికారులు నిర్ధారించారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బావిలో పడిన మిగితా భక్తులను కూడా బయటికి తీసేందుకు పోలీసులు, అధికారులు శ్రమిస్తున్నారు. కొందరికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది. ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కలెక్టర్, కమిషనర్లతో మాట్లాడారు, ఘటనపై విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. బాధితులను బావిలోంచి బయటికి తీసి వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలన్నారు. పండుగ వేళ జరిగిన ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు.
అయితే ఈ ఘటనపై పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు అంతా త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు.