నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

MLC Elections: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది.ఈ రోజు  ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంమయ్యింది . ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది.

మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన ఉంటుంది.
ఈ ఎన్నికల్లో దాదాపు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖ గ్రాడుయేట్‌ స్థానం నుంచి 37 మంది, కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 49 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 22 మంది పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీలో నిలిచారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు, కర్నూలు స్థానానికి ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. గెలుపుపై అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.
మరోవైపు తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది . కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. వివిధ పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్స్ లోని బ్యాలెట్ పేపర్స్ ను మొదటగా బండిల్స్ తయారు చేసి అవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత ప్రతి టేబుల్ వైజ్ గా పంపిణీ చేసి కౌంటింగ్ ప్రారంభిo చారు . ఎన్నికల కౌంటింగ్ దాదాపు గా 1300 ల మంది సిబ్బంది పాల్గొంన్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్ల చేశారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh