తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

Rain Alert :తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

భాగ్యనగరo  వాసులకు ఉక్కపోతాలతో సతమతం అవుతున్న జనానికి  కాస్త ఉపశమనం లభించనుంది. ఎందుకంటే, గురువారం, శుక్రవారాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మార్చి 20 తేదీ వరకు కూడా నగరంలో వర్షం కురుస్తుందని తెలిపింది వాతావరణశాఖ . అంతేగాక మార్చి 16, 17 తేదీల్లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు మార్చి 20 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలిదుమారంతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, గురువారం ఉదయం కాస్త ఎండగా ఉన్నప్పటికీ నగరంలో మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లగా మారిపోయింది. చాలా ప్రాంతాలు మేఘావృతమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆరు జోన్లు హైదరాబాద్-ఛార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో మేఘావృతమై వాతావరణం చల్లగా మారింది . హైదరాబాద్ నగర పరిధిలో గురువారం సాయంత్రం లేదా రాత్రి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 36 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ వర్షాలతో నగర ప్రజలకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం లభంచనుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురస్తాయని పేర్కొంది. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు 27 డిగ్రీ సెల్సియస్ కు తగ్గనున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh