పసిడి ప్రియులకు శుభవార్త భారీగా తగ్గిన బంగారం

Gold Price Today

పసిడి ప్రియులకు శుభవార్త పసిడి ప్రియులకు శుభవార్త భారీగా తగ్గిన బంగారం

ఈ మద్య కాల౦లో  ఆకాశన్ని  అంటిన బంగారం ధరలు  ప్రస్తుతానికి తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా ప్రతీ రోజూ గోల్డ్‌ రేట్స్‌ తగ్గుతున్నాయి. తులం బంగారం రూ. 60 వేలు దాటేస్తోందని అందరూ అనుకుంటున్న సమయంలో తగ్గుదున్న ధరలు ఉపశమనం కల్పిస్తున్నాయి. (శుక్రవారం) తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 430 వరకు తగ్గడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది.  అలాగే ఈరోజు గోల్డ్‌, సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  దేశ రాజధాని న్యూఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,880 ఉంది.  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.  చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,600 ఉంది.  బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780గా ఉంది.  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.  విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది. విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

ఇక వెండి ధరల్లోనూ భారీగా తగ్గుదుల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధరపై ఏకంగా రూ. 950 తగ్గడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,000కాగా, ముంబైలో రూ60.000 , బెంగళూరులో రూ. 71,800 , చెన్నైలో రూ. 71,800 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,800 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 71,800 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh