నేడు బీజేపీ కండువా కప్పుకోబోతున్న కన్నడ స్టార్

KICHHA SUDEEP: బీజేపీ కండువా కప్పుకోబోతున్న కన్నడ స్టార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు బీజేపీ తీర్థం స్వీకరించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సినీ నటులు, నటీమణులను పార్టీల్లోకి తీసుకురావాలని పలువురు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సినిమా ఆర్టిస్టులు రాజకీయాల్లోకి రావడం, పార్టీ తరుపున ప్రచారం చేయడం సర్వసాధారణం. ఇప్పుడు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అని అంటున్నారు. రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు రాజకీయ నేతలు సుదీప్ ఇంటి తలుపు తట్టారు. దీనితో బిజెపిలో చేర‌నున్నారు క‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్, ద‌ర్శ‌న్ తుగుదీపా  వీరిద్దరూ ఈ రోజు మధ్యాహ్నం 1.30, 2.30 గంటలకు బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు.ఇందులో అతనితో పాటు సౌత్ నటీనటులు కూడా పాల్గొనవచ్చు.

కర్ణాటకరాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా బీజేపీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ల కోసం బిజెపి చాలా మంది కన్నడ నటులను సంప్రదిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఇతర నేతల సమక్షంలో వీరు పార్టీలో చేరబోతున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 13న ఓట్లను లెక్కిస్తారు. కర్ణాటకలో వరుసగా రెండోసారి కూడా కాషాయ కండువాను ఎగరవేయాలని చూస్తున్న బీజేపీ ఈసారి స్టార్ క్యాంపెయినర్లుగా సినీ స్టార్లను రంగంలోకి దించుతోంది. వారిలో ‘విక్రాంత్ రోణ’ నటుడు కిచ్చా సుదీప్ ఒకరు.51 సంవత్సరాల కిచ్చా సుదీప్ నాయక సామాజిక వర్గానికి చెందినవారు. నేడు  సుదీప్ ఈ విషయంలో మొదట తన కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశం ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. సుదీప్ సిద్ధమైతే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి బిజెపి ముందుకు వస్తుంది అని భావిస్తున్నారు.ఇది రాష్ట్రంలో షెడ్యూల్ కులాల కిందకు వస్తుంది. కల్యాణ-కర్ణాటక ప్రాంతంలో నాయక సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంది. దీనికి తోడు సుదీప్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఫిబ్రవరిలో కిచ్చా సుదీప్‌ను ఆయన నివాసంలో కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, వారిద్దరి కలయికకు రాజకీయ ప్రాధాన్యం లేదని, వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు తెలిపారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు కన్నడ మూవీ స్టార్లు కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh