ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని స్కాట్ దొర ఇకలేరు

సుదీర్ఘ కాలంగా హాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు రే స్టీవెన్‌సన్.  ఈయన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్’ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ లోరే స్టీవెన్సన్ విలనిజం స్కాట్ దొరగా చక్కటి పండించి  ప్రేక్షకులను తన నటనతో  మైమరిపించారు. ఆయన  (58) సోమవారం  రాత్రి తుది శ్వాస విడిచారు.  అయితే ఆయన మరణానికి గల  అసలు కారణాలు తెలియరాలేదు. రే స్టీవెన్‌సన్ మృతిపై ఆయన అభిమానులు, సినీ ప్రియులు మొత్తం దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రే స్టీవెన్‌సన్ ‘క్యాసినో’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటలీలో కొద్ది రోజులుగా ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా గడుపుతోన్నారు. అలాంటిది ఆయన అదే షూట్ స్పాట్‌లో అకస్మాత్తుగా కన్నుమూసినట్లు తెలిసింది. రే  స్టీవెన్సన్ మృతి పట్ల ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  ‘మీరు చ‌నిపోయార‌నే వార్త మ‌మ్మ‌ల్ని షాక్‌కి గురిచేసింది. మీరెప్పటికీ మా హృద‌యాల్లో నిలిచే ఉంటారు. మీ ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నాం’  అని ట్వీట్ చేసింది.ఆర్ఆర్ఆర్​ సినిమాలో గవర్నర్‌ స్కాట్‌ బక్​స్టన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు

అలాగే రే స్టీవెన్సన్ 25 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఆ తర్వాత ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో అత్యుత్తమ పాత్రలను పోషించారు. అందులో కింగ్ ఆర్థర్ (2004), ది అదర్ గైస్ (2010), థోర్ (2011), ది ట్రాన్స్‌పోర్టర్: రీఫ్యూయెల్డ్ (2015), యాక్సిడెంట్ మ్యాన్ (2018) లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక, RRR చిత్రంతో ఇండియా మొత్తం పాపులర్ అయ్యారు.

1964 మే 25న లిస్సర్న్  లో పుట్టిన రే  స్టీవెన్సన్ 8 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ థియేటర్ స్కూల్ లో చేరారు.  90వ దశకంలో  టీవీ షోలలో తన కెరీర్‌ను స్టార్ చేశారు స్టీవెన్ స‌న్‌. 2000 సంవత్సరం నుండి హాలీవుడ్ చిత్రాలలో అవ‌కాశాలు వ‌చ్చాయి.  అయితే  మరో రెండు రోజుల్లో ఆయన తన 59వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు తుది శ్వాసను విడవడం ఆయన అభిమానులను కలిచి వేస్తుంది. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు.

రే స్టీవెన్సన్ 1997లోనే రూత్ గెమ్మెల్ అనే హాలీవుడ్ నటిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2005లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆంత్రోపాలజిస్టు ఎలిసబెట్టా కరాకియాతో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh