అమిగోస్‌తో వచ్చిన కల్యాణ్ రామ్ మూవీ రివ్యూ

kalyan-ram-starrer-amigos-movie

అమిగోస్‌తో వచ్చిన కల్యాణ్ రామ్ మూవీ రివ్యూ

కొత్త కథ లను ఎంకరేజ్ చేస్తుంటారు నందమూరి  కళ్యాణ్ రామ్.అయితే ఇప్పుడు అదే  కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అమిగోస్’, అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్ధం. మరి ఈ ముగ్గురి ఫ్రెండ్స్ కథ ఎంత వరకూ ప్రేక్షుకలను  ఆకట్టుకుందో  సమీక్షలో చూద్దాం.

మనుషుల్ని పోలిన మనుషులు ముగ్గురు. విరుద్ధభావాలు కలిగిన ఈ ముగ్గురిలో ఒకరు రాక్షసుడు . ఇంకొకరు అమాయకుడు (మంజునాథ్-కళ్యాణ్ రామ్), ఇంకొకడు తెలివైన వాడు (సిద్ధార్ధ్-కళ్యాణ్ రామ్). ఈ ముగ్గురూ డోపెల్‌గ్యాంగర్  అనే వెబ్ సైట్ ద్వారా కలుస్తారు. స్నేహితులుగా కూడా  మారతారు. అయితే మోస్ట్ వాటెండ్ క్రిమినల్ అయిన బిపిన్ రాయ్‌ని వేటాడుతూ ఉంటారు ఎన్ఐఏ అధికారులు. వారి నుంచి తప్పించుకోవడం కోసం. బిపిన్ రాయ్ మైఖేల్‌గా మారి సిద్దార్ధ్, మంజునాథ్‌లను ఇరికిస్తాడు. తాను బతకడం కోసం ఎవర్నైనా చంపేసే బిపిన్  మంజునాథ్, సిద్ధార్థ్‌లను చంపేసి. విదేశాలకు పారిపోదాం అనుకుంటాడు బిపిన్. అయితే ఆ రాక్షసుడి బారి నుంచి మంజునాథ్, సిద్దార్థ్‌లు ఎలా తప్పించుకోగలిగారు? బిపిన్ రాయ్‌ని ఎలా మట్టుపెట్టారు అన్నదే మిగిలిన ‘అమిగోస్’ కథ.

అయితే ఇలాంటి టఫ్ సబ్జెక్ట్‌ని డీల్ చేసేప్పుడు సాన పెట్టాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. అన్నింటినీ బ్యాలెన్స్ చేయడంలో లాజిక్‌లు మిస్ అయినా ప్రేక్షకులను   నిరుత్సాహపరచకుండా తీసిన సినిమా ఇది. సిద్దూ పాత్రతో కథను మొదలు పెట్టి.. ఒక్కో పాత్రను పరిచయం  చేసే  తీరు మూడు క్యారెక్టర్స్‌ని నడిపించిన విధానం బాగుంది. ఇషికా- సిద్దు  లవ్ ట్రాక్ రొటీన్ ఫార్మేట్‌లోనే ఉన్నా బోరింగ్‌గా అయితే అనిపించదు. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తుంది. త్రిపాత్రాభినయం కాన్సెప్ట్‌ ముగ్గురు మొనగాళ్లు, జై లవకుశ సినిమాలను గుర్తుకి తెచ్చినా వాటిలో మూడు పాత్రలకు బ్లడ్ రిలేషన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒకేలా పుట్టడం కొత్త కాన్సెప్ట్. పైగా ఆ సినిమాల్లో క్రూరంగా మారిన వ్యక్తికి గట్టి నేపథ్యం ఉంటుంది.
దర్శకుడు రాజేంద్రరెడ్డికి ఇది తొలిసినిమానే అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా ‘అమిగోస్’ని తీర్చిదిద్దారు.

కళ్యాణ్ రామ్‌ కష్టాన్ని మెచ్చుకోవచ్చు. త్రిపాత్రాభినయంలో చక్కని వైవిధ్యం కూడా చూపించాడు. అతని నటనలో, కదలికల్లో, హావభావాల్లో మెచ్యురిటీ కనిపిస్తుంది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న మూడు పాత్రల్ని ఒకేసారి చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ కళ్యాణ్‌ రామ్. మైఖేల్.. సిద్ధార్థ్.. మంజునాథ్ ఈ మూడు పాత్రల్లోనూ డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ. విలక్షణ నటనా ప్రతిభ ఉన్న నటుడిగా తనలోని యాక్టింగ్ స్కిల్స్‌కి పదునుపెట్టాడు కళ్యాణ్‌ రామ్ . అయితే క్లోజప్ షాట్స్‌లో ఎక్స్ ప్రెషన్స్ పలికించే ‘దమ్ము’న్న నటుల జాబితాలో చేరడానికి కళ్యాణ్‌ రామ్‌కి ఇంకాస్త సమయం పట్టొచ్చు. మైఖేల్‌గా తనలోని రాక్షసత్వాన్ని అద్భుతంగా పలికించిన కళ్యాణ్ రామ్.చాలా చోట్ల సింగిల్ ఎక్స్‌ప్రెషన్స్‌కే పరిమితం అయ్యారు.

కళ్యాణ్ రామ్-అషికా జంట స్క్రీన్‌పై బాగుంది. అషికా రంగనాథ్‌కి తెలుగులో ఇది మొదటి సినిమానే అయినప్పటికీ కన్నడలో పాపులర్ నటి. దీంతో కొత్త హీరోయిన్ అనే ఫీలింగ్ రాకుండా చేసింది. తన ఆర్జే ఇషికా పాత్రకి న్యాయం చేసింది. తన గ్లామర్ షోతో కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ‌కి మంచి రోల్ పడింది. హీరోకి మామయ్యగా ఇంపార్టెంట్ రోల్‌లో నటించి.హాస్యం పండించారు. ఒకరకంగా త్రిపాత్రాభినయం చేయడం కళ్యాణ్ రామ్‌కి ఎంత కష్టమో.అతనికి సపోర్టింగ్ రోల్ చేసిన బ్రహ్మాజీ కూడా అంతే కష్టపడ్డారు. ఈ విషయంలో బ్రహ్మాజీ తన సీనియారిటీని చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌లో అయ్యేపాపం అనేట్టుగా చేశారు.   మొత్తంగా.. అమిగోస్ చిత్రంతో కళ్యాణ్ రామ్ అద్భుతం చేశాడు అని చెప్పలేం కానీ.. ప్రేక్షకుల్ని అయితే నిరాశపరచలేదు. త్రిపాత్రాభినయంతో నందమూరి ఫ్యాన్స్‌కి ‘ట్రిపుల్’ కిక్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh