శుక్రవారం అరెస్ట్ చేయొద్దు కోర్టు ఆదేశాలు

Imran Khan: శుక్రవారం అరెస్ట్ చేయొద్దు కోర్టు ఆదేశాలు

న్యాయమూర్తి బెదిరింపుల కేసులో శుక్రవారం వరకు ఇమ్రాన్‌ని అరెస్టు చేయొద్దంటూ లాహోర్‌ హైకోర్టు మరో రోజు వాయిదా వేసింది. పాక్‌ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇమ్రాన్‌ అరెస్టుని అడ్డుకుంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండడంతో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. గత రెండు రోజులుగా భద్రతా బలగాలకీ ఇమ్రాన్‌ మద్దతుదారులకీ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో శుక్రవారం వరకు పోలీసు చర్యలను ఆపాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీచేసినట్టు పాకిస్తాన్‌ ఇన్‌ఫర్మేషన్‌ మినిస్టర్‌ అమిర్‌ మీర్‌ నిర్ధారించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్నసమయంలో విదేశాల నుంచి పాకిస్తాన్‌ కి వచ్చిన బహుమతులను అక్రమంగా అమ్ముకున్నారన్న అవినీతి నేరారోపణల నేపథ్యంలో గత రెండు రోజులుగా ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకి ప్రయత్నిస్తోన్న పోలీసులను ఇమ్రాన్‌ అనుచరులు వందలాది మంది అడ్డుకుంటున్నారు.

బారికేడ్లను ధ్వంసం చేసి, ఇమ్రాన్‌ ఇంటిదగ్గర భీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో కోర్టు ఇమ్రాన్‌ని ఈ రోజు పదిగంటల వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. తాజాగా కోర్టు తన ఆదేశాలను శుక్రవారం వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh