వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి బలి

వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి బలి

హైదరాబాద్‌ అంబర్‌పేటలో చిన్నారి ప్రదీప్‌ను కుక్కలు పీక్కుతిన్న ఘటన ఇంకా మరవక ముందే. అంతలోనే కుక్క దాడిలో గాయపడ్డ మరో చిన్నారి మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో 13ఏళ్ల చిన్నారి మహేశ్వరి మృతి కన్నవాళ్లను కన్నీరుమున్నీరయ్యేలా చేసింది.

నెల రోజుల క్రితం మహేశ్వరి ఇంటిముందు చదువుకుంటున్న సమయంలో కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో మహేశ్వరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. దాదాపు నెల రోజులు డాక్టర్లు ట్రీట్‌మెంట్ అందించారు. కానీ ఫలితం లేకుండాపోయింది చికిత్స పొందుతూ మహేశ్వరి ప్రాణాలు విడిచింది. వీధి కుక్కల నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలు గురించి అవగాహన వల్ల   ప్రజల్లో అవగాహనతో పాటు అధికారుల్లో చలనం వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు.

దీంతో కుక్కల స్వైరవిహారం చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. కరీంనగర్‌లో కుక్కల దాడిలో చిన్నారి మహేశ్వరి చనిపోతే మరో రెండు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు శునకాల దండయాత్ర నుంచి తృటిలో తప్పించుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని 48వ డివిజన్‌లో ఓ బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అటు వైపు నుంచి వచ్చి ఓ కుక్క బాలుడిపై దాడి చేసింది. స్థానికులు అలర్ట్ అయి కుక్కను తరిమేయడంతో బాలుడు సేఫ్ అయ్యాడు.అయితే అప్పటికే గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు .

వరంగల్ జిల్లా బ్యాంక్‌ కాలనీలోనూ సేమ్ సీన్‌. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జశ్వంత్ అనే బాలుడిపై వీధి కుక్క ఎటాక్ చేయబోయింది. స్థానికులు అప్రమత్తం కావడంతో కుక్క పారిపోయింది. కుక్క దాడి నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వీధిలో తిరుగుతున్న కుక్కలను చూసి గ్రామస్థులు, పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీధి కుక్కలను నియంత్రించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh