విద్యార్దులను ఫుల్ గా ఎంజాయ్ చేయమంటున్న వర్మ

RGV Comments: విద్యార్దులను ఫుల్ గా ఎంజాయ్ చేయమంటున్న వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద సినిమాలు చేస్తూ ప్రేక్షకులు తనను మర్చిపోకుండా చేసుకుంటున్నాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు  తాజాగా రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తినండి, తాగండి, సెక్స్ చేయండి అంటూ విద్యార్థులకు ఆయన సూచనలు చేశారు. హ్యాపీగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకోండి అని సలహాలు ఇవ్వాల్సిన చోట తినండి, తాగండి, సెక్స్ చేయండి అంటూ ఆయన సలహాలు ఇవ్వడం ఇప్పుడు వేడి రాజేస్తుంది.

అసలు విషయనికి వస్తే గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమీ ఎగ్జిబిషన్కు రాంగోపాల్ వర్మను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళిన రాంగోపాల్ వర్మ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సవాలక్ష ఆంక్షలు పెడతారు అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెబుతూ ఉంటారని కానీ అవేమీ పట్టించుకోకండి మీకు ఇష్టం వచ్చినట్లు  మీరు జీవించండి అంటూ రామ్ గోపాల్ వర్మ సలహా ఇచ్చారు. ఇక తన అనుభవంతో  చెబుతున్నానంటూ ఫస్ట్ బెంచీ స్టూడెంట్స్ ఎప్పటికీ పైకి రారని నాలాంటి లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ పైకి వస్తారని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

ఇక హార్డ్ వర్క్ చేయొద్దు స్మార్ట్ వర్క్ చేయాలి అని పేర్కొన్న ఆయన నచ్చింది తినండి, తాగండి, సెక్స్ చేయండి అంటూ సూచనలు చేశారు. ఎందుకంటే ఒకవేళ చచ్చి పైకి పోయిన తర్వాత రంభ, ఊర్వశి ఉంటారు అక్కడ ఎంజాయ్ చేయవచ్చు అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ అక్కడ అలాంటి వాళ్ళు లేకపోతే పరిస్థితి ఏమిటి అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పటినుంచి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టండి అని కీలక వ్యాఖ్యలు చేశారు .

ఈ సందర్భంగా విద్యార్థులు గతంలో జిఎస్టి అనే ఒక బోల్డ్ ఫిలింమ్  చేశారు కదా ఇప్పుడు దాని సీక్వెల్ ఎప్పుడు చేస్తారు అని అడిగితే మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా మీరే తీసుకోవచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. అలాగే నాకోసమే నేను బ్రతుకుతా , నాకు నచ్చినట్లే బ్రతుకుతానని పేర్కొన్న ఆయన నేను పోయిన తర్వాత ఈ ప్రపంచం ఏం ఐపోయినా నేను బాధ పడనని అన్నారు. ఎక్కడో రంభ ఊర్వశి , మేనక లు ఉంటారని నమ్మి ఇక్కడి సుఖాలు వదులుకోనని అన్నారు. మనకి ఎక్కడ సుఖం ఉంటదో పెద్ద వాళ్ళు వాటిని చేయొద్దంటారు, ఆంక్షలు పెడతారని పేర్కొన్న ఆయన నేను ఆ చాన్స్ తీసుకోను , అన్ని సుఖాలు ఇక్కడే అనుభవిస్తానని, చేతిలో ఉన్నప్పుడే అన్ని అనుభవించాలని అన్నారు వర్మ .

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh