రషీద్‌ ఖాన్‌ అరుదైన రికార్డు

AFG vs PAK: రషీద్‌ ఖాన్‌ అరుదైన రికార్డు

రషీద్ ఖాన్ ఈ పేరు వింటే చాలు బ్యాట్స్మెన్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఎంతటి  అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయినా సరే రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడంటే కాస్త వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదైనా మంచి బంతి వస్తేనే సిక్సర్  కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.  అంతేకానీ రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఉతికి ఆరవేయాలి.. సిక్సర్లతో చెలరేగిపోవాలి అని అనుకోరు అని చెప్పాలి. ఎందుకంటే రషీద్ ఖాన్ తన స్పిన్ బౌలింగ్ తో అంతా మాయ  చేస్తూ ఉంటాడు. ఎంతటి దిగ్గజ బ్యాట్స్మెన్ ను  అయినా సరే తికమక పెడుతూ వికెట్లు పడగొడుతూ  వుంటాడు రషీద్ ఖాన్.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్ గా ఎదిగిన  రషీద్ ఖాన్ బౌలింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరఫున మాత్రమే కాదు అటు ఐపీఎల్ లో సన్రైజర్స్  హైదరబాద్  జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు  ప్రాతినిధ్యం వహించి కోట్ల మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. అయితే కేవలం బౌలింగ్లో మాత్రమే కాదు జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్లో కూడా మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు రషీద్ ఖాన్. ఇక ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు  రషీద్‌ ఖాన్

షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 66 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ ఓటమి పాలైంది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌ 18.4 ఓవర్లలో ఆలౌటైంది.

పాక్‌ బౌలర్లలో ఇహ్సానుల్లా,షాదాబ్‌ ఖాన్‌ తలా మూడు వికెట్లు సాధించారు.

ఆఫ్గాన్‌ బ్యాటర్లలో గుర్భాజ్‌ 18 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మూడో టీ20లో ఓటమిపాలైనప్పటికీ. తొలి రెండు మ్యాచ్‌లో విజయం సాధించిన ఆఫ్గాన్‌ 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. కాగా ఆఫ్గాన్‌కు పాక్‌పై ఇదే తొలి టీ20 సిరీస్‌ విజయం.

ఇక​ ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ టీ20ల్లో ఆఫ్గాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ ఎవరికీ సాధ్యం కానీ రికార్డును సృష్టించాడు. టీ20ల్లో బౌండరీ ఇవ్వకుండా 100 బంతులు వేసిన బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ రికార్డులకెక్కాడు. సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 106 డెలివరీకి పాక్‌ బ్యాటర్‌ సైమ్ అయూబ్ సిక్స్‌ బాదడంతో రషీద్‌ రికార్డుకు బ్రేక్‌ పడిం‍ది.

ఈ మ్యాచ్‌లో రషీద్‌ బ్యాటింగ్‌లో కూడా 16 పరుగులు చేశాడు. ఇక యూఏఈ నుంచి నేరుగా రషీద్‌ ఖాన్‌ భారత్‌కు రానున్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుతో  అతడు కలవనున్నాడు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh