మరో కొత్త ప్రాజెక్ట్ ప్రారభమo చేసిన ధమ్కీ హీరో

Vishwak Sen:మరో కొత్త ప్రాజెక్ట్ ప్రారభమo చేసిన ధమ్కీ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్  సేన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అదరగొడుతున్నారు ఆయన హీరోగా వచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘ఓరి దేవుడా’ ఫ్యామిలీ ప్రేక్షకులను బాగానే అలరించింది. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం కలెక్షన్లు సాధించలేదు.
అయితే ప్రస్తుతం విశ్వక్ సేన్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ చిత్రం ధమ్కీ ఈ సినిమా మార్చి22న రిలీజ్ కానుంది. ట్రైలర్, టీజర్, ఫస్ట్‌ లుక్‌తో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి.

అలాగే ఇటీవల రిలీజైన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో తారక్‌ చేసిన కామెంట్లు విశ్వక్‌సేన్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి.
మరో రెండు రోజుల్లో ధమ్కీ విడుదల కానున్న నేపథ్యంలో విశ్వక్‌ మరో సినిమాను ప్రకటంచారు. కెరీర్‌‌లో 10వ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు విశ్వక్‌ ఎస్‌ఆర్‌‌టీ ఎంటర్‌‌టైన్మెంట్స్‌ నిర్మాణంలో సినిమా తెరకెక్కనున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

ఇక, ధమ్కీ విషయానికి వస్తే టీజర్ అండ్ ట్రైలర్‌తో మంచి క్రేను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాకు ఇప్పటికే చాలా ఏరియాల్లో బిజినెస్ జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు విశ్వక్ సేన్ కెరీర్‌లో హయ్యెస్ట్ బిజినెస్‌ అందుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. అలాగే మాస్ యాక్షన్‌గా వస్తున్న ఈ సినిమాతో విశ్వక్‌ కెరీర్‌‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల టాక్.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్  కి యంగ్‌టైగర్‌‌ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్‌సేన్‌పై పలు కామెంట్లు చేశారు. ముందుగా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాకు ఆస్కార్‌‌ అవార్డు దక్కడంపై స్పందించారు. దానికి కారణమైన వాళ్లను అభినందించారు
‘‘విశ్వక్ సేన్ సినిమాలు నాకు చాలా ఇష్టం తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడూ తపనపడుతూ ఉంటాడు. ధమ్కీ సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించాడు ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అని తాను డైరెక్ట్ చేయకుండా మరో దర్శకుడికి అవకాశం ఇవ్వాలి.

టాలీవుడ్ ప్రస్తుతం అద్భుతమైన స్థానంలో ఉంది  విశ్వక్‌సేన్‌ ధమ్కీ సినిమా ఉగాదికి రిలీజ్ అవుతోంది. విశ్వక్ సేన్ కి ఈ సినిమా పండుగ కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు ఎన్టీఆర్.
విశ్వక్‌సేన్ హీరోగా నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. 2017లో వెళ్లిపోమాకే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విశ్వక్ మొదటి సినిమాతోనే సైమా అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలతో విశ్వక్‌కు మాస్‌ ఆడియన్స్‌ లో మంచి క్రేజ్ వచ్చింది. అనంతరం పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుగా ముఖ చిత్రం సినిమాలతో టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు విశ్వక్.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh