బ్రహ్మానందం నటన చూసి మెగాస్టార్ మెగా పవర్ స్టార్ చేశారంటే?

Rangamarthanda: బ్రహ్మానందం నటన చూసి మెగాస్టార్  మెగా పవర్ స్టార్  చేశారంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ అంటే మొదట గుర్తొచ్చే ఒకే ఒక్క వ్యక్తి బ్రహ్మానందం గారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ తో, కామెడీ టైమింగ్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో బ్రహ్మానందం గారి కామెడీ సినిమాకి ఒక మేజర్ హైలైట్ గా నిలిచింది. ఆయన కామెడీ వల్లే హిట్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

ఆ విధంగా మొదటి నుంచి ప్రేక్షకులని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. హాస్యబ్రహ్మగా ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే తన కెరీర్‌లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’ మూవీలో చక్రపాణిగా ఒక సీరియస్ రోల్‌లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా మార్చి 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ‘రంగమార్తాండ’ చిత్రం మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ముఖ్యంగా సినిమా చూసిన వారంతా బ్రహ్మానందం పాత్రకు ఆకర్షితులు అయ్యిపోయారు.

ప్రేక్షకులు బ్రహ్మానందం పాత్రపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్నాళ్లూ కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఒకేసారి  ఏడిపించేశారు ఏంటి? అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారంటే చక్రపాణి పాత్రను కృష్ణవంశీ ఎలా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ప్రతీ ఒక్క ఆడియెన్ కంటతడి పెట్టేసుకుంటున్నారు. బ్రహ్మీ నటించిన పాత్రకు మంచి పేరు వస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి బ్రహ్మానందంను శాలువాతో సత్కరించి తమ ప్రేమని తెలియజేశారు. వాస్తవానికి చిరంజీవి, బ్రహ్మానందంల మధ్య ఉన్న అనుబంధం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. బ్రహ్మానందం కెరీర్‌లో చిరంజీవి పాత్ర, స్థానం ఎటువంటిదో పలుమార్లు బ్రహ్మీనే పబ్లిక్‌గా తెలిపారు.

ఇప్పుడు బ్రహ్మీ నటనకు ముగ్ధులై ఆయనని సన్మానించి ఇద్దరూ మరోసారి మెగా మనసు చాటుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మీని మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి శాలువాతో సత్కరిస్తున్న పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కరాలు కొడుతున్నాయి .

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh