ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూత

టాలీవుడ్‌లో వరుస విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం నాడు ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా. ఈ రోజు సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్ను మూశారు. నెలరోజులకు పైగా ఎంజీఎం  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం  తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాభపడుతున్నారు. ఈ క్రమంలో శరత్‌బాబు బెంగుళూరు లో చికిత్స తీసుకున్నాడు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదట ఆయన ఆరోగ్యం కుదుట పడినప్పటికీ మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల కోలుకోలేక ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు.

శరత్ బాబు మరణ వార్తతో చిత్రసీమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. శరత్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన భౌతిక కాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శరత్‌బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు శరత్‌బాబు గా మార్చుకున్నారు. 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించారు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 1973 ‘రామరాజ్యం’ మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇప్పటి వరకు ఆయన పలు భాషల్లో సుమారు 220 కి పైగా చిత్రాల్లో నటించారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లో నటించి తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత విభిన్నమైన క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు. సీతాకోక చిలుక(1981) , ఓ భార్య కథ(1988), నీరాజనం (1989) మూడు చిత్రాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అవార్డు కైవసం చేసుకున్నారు. ఆయన కెరీర్ లో ఎన్నో అవార్డులు. రివార్డులు సొంతం చేసుకున్నారు.

అయితే శరత్ బాబు హీరోగా కంటే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లు ఆయ‌న‌కు ఎక్కువ‌గా గుర్తింపు తీసుకొచ్చాయి. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్ రూపొందిన గుప్పెడు మ‌న‌సు, ఇది క‌థ కాదు, పంతుల‌మ్మ‌తో పాటు ప‌లు సినిమాలు వెలుగులోకి తీసుకొచ్చాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh