ప్రమాదకరంగా మారిన ప్రీ వెడ్డింగ్ షూటింగులు

పెళ్లిళ్లు, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ల కోసం భారీ విన్యాసాలు చేసే ట్రెండ్ ఇండియాను పట్టి పీడిస్తోంది. అయితే ఈ విన్యాసాలు ఎల్లప్పుడూ సురక్షితం కాదని తాజా వీడియో ఒకటి తెలియజేస్తుంది. మహారాష్ట్రకు చెందిన ఒక పెళ్లి వీడియోలో వధూవరులు తమ పెళ్లి రోజున మెరుపు గన్ లతో ఫోటోఘాట్ కు పోజులిచ్చారు. పక్కపక్కనే నులచవని పోజులిస్తూ గన్ లు పట్టుకుని కెమెరాకు చిరునవ్వులు చిందిస్తున్నారు.

అప్పుడు ఈ జంట వారి వారి గన్ లను వెలిగించగా ఆ తుపాలకుల నుండి మెరుపుల వర్షం కురిసింది. కాగా ఆ మెరుపులు ఒక్క సరిగా వధువు యక్క మొఖం మీదకు వచ్చింది.  దాంతో అక్కడ ఉన్నవారు అందరూ   ప్రేక్షకుల అందరూ ఒక్క సరిగా షాక్ కు గురయ్యారు. ఆ వీడియోలో వధువు మెరుపు గన్ పేలి ఆమె ముఖంపై కొట్టడం కనిపిస్తుంది. దీంతో భయపడిన ఆమె వెంటనే గన్ ను కిందకు దించి భయంతో తన మాలను తొలగించింది. వధువును ఆదుకునేందుకు జనం పరుగులు తీశారు.

కాగా ఈ వీడియొ ను మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని జున్నార్ నగరానికి చెందిన న్యూస్ కవర్ చేసే ప్రాంతీయ న్యూస్ ఛానెల్ జున్నార్ టైమ్స్ ఈ వీడియోను యూట్యూబ్లో షేర్ చేసింది. ఇది వెంటనే ట్విటర్లోకి రావడంతో ఈ వీడియొ వైరల్ అయ్యింది.  “ఈ రోజుల్లో ప్రజల తప్పేమిటో నాకు తెలియదు. వారు పెళ్లి రోజులను పార్టీలుగా చేసుకుంటున్నారు. ఈ విధంగా వారు వారి ఆనందపు క్షణాలను ఇలా నాశనం చేసుకుంటున్నారు” అని  కొందరు అభిప్రాయ పడుతున్నారు.  ఈ వీడియొ చూసిన వారందరూ ఆమె ప్రమాదం నుండి సురక్షితం గా బయటపడి నట్లు బావిస్తున్నాము అంటూ ట్విటర్ లో కామెంట్స్ చేస్తున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh