ఉగాదికి పవన్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ 

పవన్ ఫ్యాన్స్‌కు ఉగాదికి సర్‌ప్రైజ్

పవన్ కల్యాణ్ ఏకధాటిగా సినిమాలు చేస్తూ ఏ స్టార్ హీరోకూ సాధ్యం కాని రీతిలో దూసుకుపోతోన్నాడు. కాగా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రబంజనం సృష్టించిన పవన్ ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులను పెట్టుకుని ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో ఇప్పుడు పవర్ స్టార్ ‘వినోదయ సీతమ్’ రీమేక్ మూవీని కొన్ని రోజుల ముందు ప్రారంబించిన విషయం తెలిసినదే. ఈ చిత్రంలో పవన్ మెనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించడం తో ఈ చిత్రంపై ఇంకా అంచనాలు తారాస్థాయిలో పెరిగాయి.

కాగా ఈ చిత్రం తమిళంలో సముద్రఖని స్వీయ దర్శకత్వంలో ‘వినోదయ సీతమ్’ పేరు తో తెరకెక్కింది. తెలుగులో కూడా ఆయనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మెగా మల్టీస్టారర్‌గా రూపుదిద్దు కోవటంతో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి చాలా వరకూ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అలాగే, వీలైనంత త్వరగానే దీన్ని పూర్తి చేసి ఆగస్టులోనే విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ఉగాది సందర్భంగా మార్చి 22వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని నుంచి ఓ అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆ పోస్టర్‌ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లు ఇద్దరూ దర్శనమివ్వబోతున్నారని సమాచారం. దీనికి ‘దేవర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. దాంతో ఈ మూవీ నుంచి ఏదైనా కావాలని కోరుకుంటోన్నా ఫ్యాన్స్ ఉగాది ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

మెగా కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తోన్నారు. అలాగే, శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్‌ను చేస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. ఇందులో పవన్ దేవుడి పాత్రను చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.

 

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh