నేడు టీడీపీ కండువా కప్పుకొనున్న కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

 

Kotamreddy Giridhar Reddy : నేడు టీడీపీ కండువా కప్పుకొనున్న కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

ఏపీలో రాజకీయ ఎప్పటికప్పుడు రసవత్తరం గా మారుతున్నాయి. వైసీపీ – టీడీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసారు. టీడీపీ అభ్యర్దికి మద్దతుగా ఓట్లు వేయటంతో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.
అయితే ఈ రోజు వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. నేడు ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ కడవలు కప్పుకుని పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలి వరకూ ఆయన వైఎస్ఆర్‌సీపీ సేవాదళ్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చే్సతూ ఉత్తర్వులు జారీ చేశారు.  శ్రీధర్ రెడ్డిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత గిరిధర్‌ను ప్రోత్సహించాలని వైసీపీ అధిష్టానం అనుకుందని ప్రచారం జరిగింది.  అయితే గిరిధర్ రెడ్డి  సోదరుడితో పాటే ఉండటంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే శ్రీధర్ రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  అయితే ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొంత కాలంగా వైసీసీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందంటూ ప్రభుత్వంతో పాటూ సొంత పార్టీపై ఆరోపణలు చేశారు.  ఆయన కూడా పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది.  అయితే మేము  నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరుతున్నానని, తనకు అంతా మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందరర్భంగా చంద్రబాబు , లోకేష్‌ ఫ్లెక్సీలను నగరమంతా ఏర్పాటు చేశారు.

నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించి  ఆ తరువాత అమరావతికి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. రెండు గంటల తర్వాత చంద్రబాబు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే వైసీపీకి దూరం జరిగినప్పుడే  2024 ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh