నేడు ఈడీ విచారణకు హాజరుకాని ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam: నేడు ఈడీ విచారణకు హాజరుకాని ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేత కవిత నేడు రెండోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆఖరు నిమిషంలో ఆమె విచారణకు రాలేనని ఈడీకి సమాచారం ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత గురువారం రెండోసారి ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. గురువారం ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ ముందు హాజరు కావాలి.  కానీ 11.30 గంటల వరకు కూడా ఆమె ఈడీ ముందు హాజరు కాలేదు. అసలు కవిత విచారణకు వస్తందా లేదా అన్న ఉత్కంఠత నెలకొంది.

ఈ క్రమంలో 11.30 గంటల తర్వాత కవిత ఈడీకి సమాచారం పంపింది. అయితే డిల్లీ లో ఉన్న ఎమ్మెల్సీ కవిత తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనని. అయితే మరో రోజు వస్తానని తెలిపింది. అనారోగ్య కారణాల వల్లే ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నానని కవిత వెల్లడించింది. మరో రోజు విచారణ తేదీ నిర్ణయించాలని కోరింది. ఈ క్రమంలో కవిత న్యాయవాది సోమ భరత్‌ ఈడీ అధికారులకు ఈ విషయం తెలిపారు.

ఇక ఈ కేసులో ఈ రోజు అనగా మార్చి 16న జరిగే విచారణ ఎంతో కీలకం. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన రామచంద్రపిళ్లై కస్టడీ నేటితో ముగియనుంది. అలానే సిసోడియా కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ ఈ ముగ్గురని కన్‌ఫ్రంటేషన్‌లో విచారించాలని భావించింది. కానీ నేడు కవిత విచారణకు గైర్హాజరైతే కన్‌ఫ్రంటేషన్‌లో విచారించేందుకు అవకాశం లేకుండా పోతుంది. అంతేకాక మార్చి 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణ ఉన్నందున కవిత విచారణకు హాజరు కాలేనని తెలిపింది. ఈ నేపథ్యంలో కవిత అభ్యర్థనపై ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం.

షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సి వుండగా . ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత. ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించటం ద్వారా విచారణకు హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కవితకు మద్దతుగా ఢిల్లీలో ఐదుగురు బీఆర్ఎస్ మంత్రులు ఉన్నారు. ఎప్పటికప్పుడు లాయర్లతో వారు చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. వాస్తవంగా అయితే ప్రస్తుతం ఢిల్లీలో కవిత ఉన్న ఇంటి నుంచి కేవలం ఐదు, 10 నిమిషాల్లోనే ఈడీ ఆఫీసుకు చేరుకోవచ్చు. అయినా కవిత హాజరుకాలేదు ఈడీ అధికారుల విచారణ తీరును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో మార్చి 15వ తేదీన ఆమె పిటీషన్ దాఖలు చేశారు. ఆ విచారణను వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh