తల్లిని ఐదు ముక్కలు చేసి పాలిథిన్‌లో చుట్టిన కూతురు

Mother Death: తల్లిని ఐదు ముక్కలు చేసి పాలిథిన్‌లో చుట్టిన కూతురు

ముంబాయిలో  ఒక మహిళ, ఆమె కుమార్తె కలిసి నివాసం ఉంటున్నారు. మహిళ ఆమె కుమార్తెను చాలా ప్రేమాగా చూసుకునేదని తెలిసింది. కానీ  నెల రోజుల క్రితం అదృశ్యమైన ఆ మహిళా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ప్లాస్టిక్ సంచిలో బయటపడటం కలకలం రేపింది. మహిళను ఆమె 22 ఏళ్ల కుమార్తె హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ శవాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని పోలీసులు తెలిపారు. కన్న తల్లిని ఆమె కూతురు ఎందుకు హత్య చేసి వుంటాది అనే విషయం ఇప్పుడు తెలియకూడవుంది.

ముంబయిలోని లాల్‌బాగ్ చాల్‌లో నివసిస్తున్నమృతురాలు వీణా ప్రకాష్‌ జైన్‌ గతేడాది డిసెంబర్ 27న మెట్లపై నుంచి కిందపడి తన తల్లి వీణా ప్రకాష్‌ జైన్‌ కి తీవ్రగాయాలయ్యాయని రింపుల్ తన వాంగ్మూలంలో పేర్కొంది. అదే సమయంలో రెండు రోజుల తరువాత తన తల్లి   మరణించింది. తన తల్లిని చంపిన నేరం తనపైనే పడుతుందని అనుకుంది. తన తల్లి మరణించిన తర్వాత మృతదేహాన్ని పారవేసే మార్గాన్ని ఇంటర్నెట్‌లో పరిశీలించి తీసుకున్నానని పేర్కొంది. అనంతరం సమీపంలోని దుకాణం నుండి మార్బుల్ కట్టర్‌ను కొనుగోలు చేసినా రింపుల్ దీంతో తన తల్లి మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి పాలిథిన్‌లో చుట్టింది.మృత దేహాన్ని కోసేందుకు మార్బుల్ కట్టర్ కొన్నానని అయితే మృతదేహం పూర్తిగా దానితో కట్ చేయలేకపోవడంతో అప్పుడు కత్తిని కూడా వాడినట్లు పోలీసులకు తెలిపింది. . మృతదేహం ముక్కలను రెండు నెలలుగా ఇంట్లో ఉంచడం వల్ల దుర్వాసన వస్తోందని పోలీసుల విచారణలో అంగీకరించింది. ఇంట్లో ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో మళ్లీ ఇంటర్నెట్‌లో స్మెల్ ను తొలగించే మార్గం కనిపెట్టి ఆన్‌లైన్‌లో అటువంటి పరిస్థితిలో మృత దేహం నుంచి వస్తున్న దుర్వాసనను తగ్గించేందుకు టీ ఆకులు, ఫినాయిల్, సుమారు 40 బాటిళ్ల ఎయిర్ ఫ్రెషనర్‌ను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. పోలీసులు రింపుల్ జైన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం ప్రస్తుతం రింపుల్ జైన్‌ సోమవారం వరకుపోలీసు కస్టడీలో ఉండాల్సి ఉంది.

అలాగే ఈ కేసులో ఓ వ్యక్తి వాంగ్మూలాన్ని పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. ఈ వ్యక్తిని లక్నో నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవసరమైన విచారణ తర్వాత విడుదల చేశారు. ఈ వ్యక్తికి ఈ సంఘటనతో ప్రత్యక్ష సంబంధం లేదు. అయినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నగరం విడిచి వెళ్లడం నిషేధించబడింది. ఈ వ్యక్తికి రింపుల్‌కి మధ్య పరిచయం ఉన్నదని తెలుస్తోంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh