చివరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కథ విషాదాంతం

Vizag steel Plant: చివరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కథ విషాదాంతం

మేము వెళ్లిపోతున్నాం అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని అదృశ్యమైన ఉక్కు ఉద్యోగి చిత్రాడ వరప్రసాద్‌, అతని భార్య మీరా మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి.

అనకాపల్లి కొప్పాక వద్ద ఉన్న ఏలేరు కాలువ ఒడ్డున వరప్రసాద్‌, మీరా బైక్‌, చెప్పులు, బ్యాగు లభించిన చోటుకు రెండు కిలోమీటర్ల దూరంలోని రాజుపాలెం రైల్వేగేటు సమీపంలోని కాలువలో మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దంపతులు సెల్ఫీవీడియో తీసుకున్నా విషయం అందరికీ తెలిసిందే.  వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని కుమారుడు, బంధువులకు సెల్ఫీ వీడియో పంపించారు. అంటూ ఉక్కు ఉద్యోగి దంపతులు రోదిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియోను బంధువులు, సన్నిహితులకు పంపి సోమవారం రాత్రి ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన దువ్వాడ పోలీసులు సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అనకాపల్లి మండలం కొప్పాక వద్ద ఏలేరు కాలువ పక్కన దంపతుల చెప్పులు, సెల్‌ఫోన్‌, హ్యాండ్‌ బ్యాగ్‌ లభించాయి.

స్టీల్  ప్లాట్ ఉద్యోగి చిత్రాడ వరప్రసాద్‌ (47), భార్య మీరా (41), కుమారుడు కృష్ణ సాయితేజ (19)తో శివాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. గత ఏడాది కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు కృష్ణసాయితేజతో కూర్మన్నపాలెంలో ఓ బ్యాటరీ దుకాణం పెట్టించారు. వరప్రసాద్‌ కొద్దికాలంగా వెన్నెముకకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబ, ఆరోగ్య అవసరాల కోసం తోటి ఉద్యోగుల వద్ద అధిక వడ్డీలకు అప్పు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పులు ఇచ్చినవారు తరచూ ఇంటి వద్దకు వచ్చి డబ్బులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తుండడంతో మనస్తాపం చెందేవారని సన్నిహితులు చెబుతున్నారు.

వారి కుమారుడు కృష్ణసాయితేజ దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి తండ్రి వరప్రాద్‌ ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా వెతగ్గా అనకాపల్లి జిల్లా కొప్పాక ఏలేరు కాలువ దగ్గర వరప్రసాద్‌ ఫోన్‌, చెప్పులు, హ్యాండ్‌ బ్యాగు గుర్తించారు. దువ్వాడ ఎస్‌ఐ కె.దేముడునాయుడు సమాచారంతో అనకాపల్లి గ్రామీణ ఎస్‌ఐ నరసింగరావు ఐదుగురు గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు లభ్యం కావడంతో తిరుమలనగర్‌లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేకే తమ అమ్మ నాన్న  ఆత్మహత్య చేసుకున్నారని కుమార్తె దివ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh