భారతీయులను సురక్షితంగా తరలించాలని ప్రధాని మోదీకి కేరళ సీఎం లేఖ

ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో గత వారం రోజులుగా ఆ దేశ ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్‌ రాజధాని ఖార్తోమ్‌ దద్దరిల్లుతున్నది. సూడాన్‌ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.

రాజకీయ అధికారం కోసం ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటిదాకా 400 మందికిపైగా అమాయక పౌరులు చనిపోయారని సమాచారం. పౌరుల మృతదేహాలు వీధుల్లో, రోడ్లపై కనపడుతున్నాయి. ఘర్షణ కారణంగా అక్కడి భారతీయులెవరు అక్కడ భారత ఎంబసీకి వెళ్లద్దని భారత ప్రభుత్వం సూచించింది.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూడాన్ లో చిక్కుకున్న కేరళతో సహా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని  ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సూడాన్ లోని భారత రాయబార కార్యాలయం చేస్తున్న ప్రయత్నాలకు పినరయి విజయన్ లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం, సహాయం అవసరమైన సూడాన్ లోని భారతీయులకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి చాలా మందికి తాగునీరు, విద్యుత్, ఆహారం, మందులు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవని పేర్కొంటూ కేరళ ప్రభుత్వానికి వినతులు, కాల్స్ వచ్చాయని తెలిపారు.

వైమానిక దాడుల్లో ఖర్తూమ్ విమానాశ్రయం భారీగా దెబ్బతిన్నందున, రాజధాని నగరం గుండా స్వదేశానికి తరలించడం అందుబాటులో లేదని అక్కడ చిక్కుకుపోయిన వారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారని సీఎం పేర్కొన్నారు.

పలువురు కేరళీయులు సూడాన్ లోని మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్నారని, వారిని స్వదేశానికి రప్పించాల్సిన అవసరం ఉందని తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు.

సూడాన్ లో ఈ సంఘర్షణ ఆ దేశ సైనిక నాయకత్వంలోని దుర్మార్గమైన అధికార పోరాటం యొక్క ప్రత్యక్ష ఫలితం. సూడాన్ సాధారణ సైన్యానికి, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) అనే పారామిలటరీ దళానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh