Vijayashanthi :కేసీఆర్ పై విరుచుకుపడ్డ విజయ శాంతి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే మొదట ఏఈ పరీక్ష పేపర్ మాత్రమే లీక్ అయిందనుకున్న తరుణంలో విచారణ చేపట్టిన సిట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే టీఎస్‌పీఎస్సీపేపర్ లీకేజి ఘటనపై తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో బాధితుల పక్షాన గొంతు వినిపించేందుకు బీజేపీ సిద్దమయ్యింది. ఈ ధర్నా కార్యక్రమంలో బండి సంజయ్, ఈటెల రాజేందర్, విజయశాంతి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బీజేపీ మహిళా నేత విజయశాంతి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదంతో హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పాత్ర కూడా ఉందని విజయశాంతి ఆరోపించారు. క్రిమినల్ పనులు చేసేది కేసీఆర్ ప్లెజర్ ఇల్లీగల్‌గా దందాలు చేసేది కేసీఆర్ ప్రెజర్ ఇది కేసీఆర్ అసలు స్వరూపం అని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ చేసేవన్నీ ఫ్రాడ్ పనులేనని మళ్లీ అందులో భేరాలు ఆడతాడని ఆరోపించిన విజయశాంతి మొత్తానికి ఆయనకు కావాల్సింది కేవలం లాభాలు మాత్రమేనని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ సర్వ నాశనమైందన్నారు విజయశాంతి. 30 లక్షల మంది యువత జీవితాలతో కేసీఆర్ ఆడుకున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు మౌనం విడాలని పోరాటానికి సిద్ధం కావాలని విజయశాంతి సూచించారు. తెలంగాణలో అసలు సిసలైన ఉద్యమం మొదలైందని తెలిపారు. పేపర్ లీ కేజీతో వ్యాపారం జరుగుతుందని ఆరోపించారు. ఈ పేపర్ లీక్ ను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనికేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలో గర్జించారు తెలంగాణ బీజేపీ నేతలు.