కంటతడి పెట్టుకున్నా మంచు మనోజ్ భార్య

Manchu Manoj: కంటతడి పెట్టుకున్నా మంచు మనోజ్ భార్య

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు  మంచు మనోజ్ తాజాగా భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో అంగరంగ వైభవంగా  మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి వివాహాo ఈ వివాహ వేడుకలో  మంచు మోహన్ బాబు విష్ణు విజయమ్మ, భూమా అఖిల ప్రియ దంపతులు, ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అందులో నిక్కీ గర్లానీ, శివ బాలాజీ దంపతులు, కోదండ రామిరెడ్డి, పరచూరి గోపాలకృష్ణ, వైఎస్ విజయమ్మ అందరూ ఈ జంటను ఆశీర్వదించారు.

అయితే మార్చి 19న మోహన్ బాబు 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని మోహన్ బాబుకి చెందిన శ్రీవిద్యానికేతన్ సంస్థల్లో మోహన్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ ఎమోషనల్ గా ప్రసంగించారు. మంచు మనోజ్, భూమా మౌనిక జంటగా మోహన్ బాబు బర్త్ డే వేడుకలకు హాజరు కావడం విశేషం. మనోజ్ విద్యార్థుల గురించి ప్రసంగిస్తూ చివర్లో తన తండ్రి, భార్య గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యాడు. నేను ప్రేమించిన అమ్మాయి స్వేచ్ఛగా ఉండాలి. తన డ్రీమ్స్ ని వెతుక్కోవాలి. తాను ఏం చేయాలన్నా నేను సపోర్ట్ ఇవ్వాలి. ప్రతి మగాడి గెలుపు వెనుకాల ఆడవారు ఉంటారు. ఆడవారి విజయం వెనుక కూడా మగాళ్లు ఉండాలి అని మంచు మనోజ్ తెలిపారు. మనోజ్ ఇలా మాట్లాడుతుంటే అతడి భార్య మౌనిక సంతోషంతో కంటతడి పెట్టుకున్నారు.

మా నాన్న గారు నన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే వుoటున్నారు .  కానీ నేను కొన్ని వందలసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టాను. కానీ ఎప్పుడూ ఆయన ప్రేమ మాత్రం తగ్గలేదు. నాన్న నేను ఒక అమ్మాయికి మాటిచ్చాను జీవితాంతం తోడుగా ఉంటానని అని చెబితే నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని అన్నారు. మీ అందరికి తెలుసు మౌనికకి తల్లిదండ్రులు లేరు. కానీ మా నాన్న మౌనిక నా మూడో కూతురు అని అన్నారు. ఎన్ని జన్మలెత్తినా మా నాన్న రుణం తీర్చుకోలేను అని మంచు మనోజ్ ఎమోషనల్ గా మాట్లాడారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh