ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్తగా రూల్స్ సూపర్ : రోహిత్ శర్మ

IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్తగా రూల్స్ సూపర్ : రోహిత్ శర్మ

ఐపీఎల్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్లలోనూ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. 2021 సీజన్‌లో నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్ చేరలేకపోయిన ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లో అయితే 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకుని, ఆఖరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా తప్పుకుంటున్నట్టు తేలడంతో ముంబై ఇండియన్స్ టీమ్‌కి షాక్ తగిలింది. బుమ్రా లేకపోయినా జోఫ్రా ఆర్చర్, జే రిచర్డ్‌సన్‌లతో కథ నడిపిద్దాం అనుకుంటే. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ కూడా గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ ఆడడం అనుమానంగా మారింది. అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్తగా అమలు చేయనున్న నయా రూల్స్ తనకు బాగా నచ్చాయని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మఅన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు టాస్ పడిన తర్వాత తుది జట్లను ప్రకటించడం బాగుందన్న రోహిత్. ఈ నిబంధనలతో లీగ్ మరింత రసవత్తరంగా సాగనుందన్నాడు. ఈ సారి లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

వైడ్‌, నోబాల్‌కు రివ్యూ, టాస్‌ తర్వాత తుది జట్టు ప్రకటన, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఇలా ఎన్నో కొత్త విషయాలను ఈ సీజన్‌లో ప్రవేశ పెట్టబోతుంది. లీగ్ ప్రారంభానికి ముందే ‘ఇంపాక్ట్ ప్లేయర్’రూల్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆల్‌రౌండర్లకు ఆదరణ తగ్గుతుందని కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తుండగా. ఈ రూల్‌తో భారత ఆటగాళ్లకు మేలు జరగనుందని మరికొందరు అంటున్నారు.

టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ  మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని.. మరో రెండు- మూడు సీజన్లపాటు ఐపీఎల్‌ ఆడే సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2023 టోర్నీకి సమయం ఆసన్నమైన సంగతి తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ మార్చి 31న మొదలుకానుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పది జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి.  ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఈ నిబంధనపై స్పందించాడు. తనకు బాగా నచ్చిందని చెప్పాడు.

ఈ రూల్స్‌తో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మేం తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ జట్టు ఎలా ఆడుతుందో మాకు బాగా తెలుసు. దానికి తగ్గ 12 మంది సరైన ఆటగాళ్లను మేం మైదానంలోకి దింపుతాం. గాయంతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు చర్చలు చేస్తున్నాం. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తాం

బుమ్రాలేని లోటును తీర్చే కొందరు ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. వారిపై కూడా మేం ఓ కన్నేసాం. బుమ్రా లేని లోటును వారు భర్తీ చేస్తారని ఆశిస్తున్నాం. బుమ్రా గైర్హాజరీ ఫ్రాంచైజీకి పెద్దలోటే. కానీ యువ ఆటగాళ్లకు ఇదో సువర్ణవకాశం. అదేవిధంగా కుర్రాళ్లపై అనవసర ఒత్తిడి పెంచాలని నేను అనుకోవడం లేదు. జట్టులోని ఆటగాళ్లకు ఎవరీ బాధ్యతలు ఏంటనే విషయం బాగా తెలుసు. ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లకు టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా ఉంటుంది.’అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh