ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కవిత ను విచారిస్తున్న ఈడీ

Kavitha:ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కవిత ను విచారిస్తున్న ఈడీ

దేశంలో పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ముందు  ఈ రోజు హాజరయ్యారు. ఈ నేపద్యంలో
ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆమెతో పాటు అరుణ్ పిళ్లైను కూడా అధికారులు విచారిస్తున్నారు.  అయితే కొద్దిసేపటి క్రితం కార్యాలయంలోకి డాక్టర్ల బృందం కూడా వెళ్లంది. అందులో ఒక మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. ఇక ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ చేరుకున్నారు. ఆయనతో పాటు న్యాయవాదులు భరత్, గండ్ర మోహన్ కూడా ఉన్నారు. కొన్ని గంటలుగా విచారణ ఎదుర్కొంటున్న కవితను అరెస్ట్ చేస్తారా ? లేక రెగ్యులర్‌గా ఆమెను కలిసేందుకు వీరంతా వచ్చారా ? అన్నది ఉత్కంఠగా మారింది. అయితే అరెస్ట్ లాంటి పరిణామం ఏమీ లేదని ఆమెను కలిసి వచ్చిన వాళ్లు చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నాలుగు గంటలపాటుగా వీళ్లిద్దిరినీ ఎదురుదెరుగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. సౌత్‌ గ్రూప్‌తో సంబంధాలపై ముఖాముఖిగా వీళ్లను ప్రశ్నించినట్లు సమాచారం. సుమారు నాలుగు గంటలపాలు వీళ్లను ప్రశ్నించి అనంతరం పిళ్లైను కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టుకు తరలించారు.

ఢిల్లీ స్పెషల్‌ కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అనంతరం పిళ్లైని తీహార్‌ జైలుకు తరలించారు. మరోవైపు కవితకు ఈడీ అధికారలు విడిగా విచారిస్తున్నారు.

అయితే అంతకముందు కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లారు. ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆమె హాజరుకాలేదు. దీంతో ఆమెకు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు  హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh