ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా?: హరీశ్ రావు

ప్రజల నోట్లో మట్టికొట్టిన చంద్రబాబును, తెలంగాణ ప్రజలు పట్టించుకోరని హరీష్ రావు అన్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించారని, అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదని అందుకే ఆయన ఫైర్ అయ్యారని అంటున్నారు. చంద్రబాబు భస్మాసుర హస్తం అని.. అందుకే ఆ కూటమి చిత్తుగా ఓడిపోయిందని చెప్పారు. బార్డర్ జిల్లాలో సభ పెట్టి..తాను చెప్పనిదే కోడి కూయదని చెప్పే రకం చంద్రబాబు అని పంచ్‌లు పేల్చారు.

చంద్రబాబు ఓడిపోయారు కాబట్టి ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అని హరీశ్ రావు ప్రశ్నించాడు. చంద్రబాబు మంచి నాయకుడు కానందున రైతుల గురించి, ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఖమ్మంలో చంద్రబాబు షో నిర్వహించారని, ఇది తప్పని అన్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ టీడీపీ కాదని.. ఇదంతా వేరే రకం అని స్పష్టం చేశారు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh