అసెంబ్లీ కొట్టుకున్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు

Fighting in AP Assembly: అసెంబ్లీ కొట్టుకున్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. అదే సమయంలో బయట రెండు పార్టీల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉద్రిక్త ఘటనలపై తీవ్రంగా స్పందించారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామి పై దాడి చేయడం దారుణమన్నారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. నియంత రాజారెడ్డి రాజ్యంగం అమలు చేస్తున్న సీఎం జగన్ ప్రోద్భలంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అన్నారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సభలో జరిగిన ఘటనతో ముఖ్యమంత్రి జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిజంగా జగన్ పేరు నిలిచిపోతుందని అయితే చట్టసభలకు మచ్చ తెచ్చిన సిఎంగా నిలిచిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ  సిద్దాంతం ఏంటో ప్రజలకు అర్థం అయ్యిందనిచంద్రబాబు  అభిప్రాయపడ్డారు. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ప్రతికూలంగా రావడంతో ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆ ఓటమిని జీర్ణించుకోలేకే పిచ్చెక్కి జగన్ ఇలా వ్యవహరించారని, ఇది శాసన సభ కాదుకౌరవ సభ అని చంద్రబాబు వ్యాఖ్యనించారు .

అసలు  వైసీపీ ఎమ్మెల్యేలే తమపై దాడి చేశారని టీడీపీ  నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుబ దాడి చేశారన్నది టీడీపీ వాదన. వైసీపీ ఎమ్మెల్యేలు నెట్టేయడంతోనే స్పీకర్ పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారని చెబుతున్నారు. అలాగే మాజీమంత్రి వెల్లoపల్లి  టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గర ప్లకార్డ్ లాక్కోని నేట్టేశారంటున్నారు. వైపీపీ నేతలు మాత్రం టీడీపీ సభ్యులే తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ కాల్ చేశారు. బుచ్చయ్య చౌదరిని ఫోన్లో పరామర్శించారు లోకేష్. దీంతో సభలో జరిగిన తీరును లోకేష్ కి బుచ్చయ్య వివరించారు. లోకేష్ మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా లేక రాక్షస రాజ్యం లో ఉన్నామా అనే అనుమానం వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh