Avinash Reddy : నేడు అవినాష్‌ రెడ్డి

Avinash Reddy

Avinash Reddy :  మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణను

ఎదుర్కొంటున్నఅవినాష్ రెడ్డి అలాగే  సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా చూడాలని అవినాష్

రెడ్డి కోరగా సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. తన తల్లి ప్రస్తుతం కర్నూలులోని ప్రభుత్వ

ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్నారని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఆమె ఆరోగ్యం కుదుటపడే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అవినాష్ రెడ్డి కోరారు.

అయితే, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం అవినాష్

రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అవినాష్ పిటిషన్‌లో వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత ఇంప్లీడ్ అవ్వనున్నారు.

అవినాష్‌కి ముందస్తు బెయిల్ ఇస్తే, కేసులో జరిగే పరిణామాలపై కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీత పేర్కొన్నారు.

ఒకవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు వెకేషన్ బెంచ్ లోనేడు విచారణ జరగనుండగా,

మరో పక్క కర్నూలులో ఆసుపత్రి వద్ద అవినాష్ రెడ్డి అనుచరుల సీబీఐకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని

నిర్వహిస్తున్నారు. సీబీఐకి మానవత్వం లేదా అని అవినాష్ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

అసుపత్రిలో తల్లి చికిత్స పొందుతుంటే అరెస్టు చేయాలని చూడటం Avinash Reddy :

ఏమిటంటూ మండిపడుతున్నారు. అయితే అవినాష్ రెడ్డి సీబీఐకి 27వ తేదీ తర్వాత విచారణకు

హజరు అవుతానని తెలియజేస్తూనే ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తుండటంతో అనుమానాలు

వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి, అతని అనుచరులను సీబీఐ అరెస్టు చేయడంతో

అవినాష్ రెడ్డి ని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి.

తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

మరోవైపు అవినాష్‌ రెడ్డి అరెస్టుతో మూలాలు కదలనున్నాయనే టాక్‌ గట్టిగానే విబడుతోంది.

అందుకోసమే అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేయకుండా తీవ్రంగా అడ్డుకుంటున్నారని చర్చించుకుంటున్నారు.

చివరకు అధికార పార్టీ ఎంపీ కోసం పోలీసులను, ప్రజా ప్రతినిధులను కూడా వాడుకుంటున్నారని

పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు.

తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశాలివ్వాలన్న అవినాష్

రెడ్డి తరపు లాయర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో అరెస్టుకు ఎలాంటి ఆటంకాలు లేనట్లే.

నిజానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సీబీఐకి గతంలోనూ ఆటంకాలు లేవు. అవినాష్ రెడ్డి

ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టుకు సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో

Avinash Reddy :  ని అరెస్ట్ చేసి ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ స్పష్టం చేసింది. అయితే, అరెస్టు నుంచి రక్షణ

లభించకపోయినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. విచారణకు పిలిస్తే,అరెస్ట్ చేస్తారేమోన్న ఉద్దేశంతో

అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వివిధ కారణాలు చూపి హాజరు కావడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh