Visakhapatnam: కుప్పకూలిన మూడు అంతస్థుల భవనం ముగ్గురు దుర్మరణం
అర్ధరాత్రి విశాఖ నగరం ఉలిక్కిపడింది. అందరూ గాఢ నిద్రలో ఉండగా మూడు అంతస్తుల భవనం నేలమట్టమైంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అసలు వివరలోకి విశాఖ కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో అర్ధరాత్రి 2 గంటల టైమ్ లో మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ముగ్గురు మృతి చెందగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న మూడు మృతదేహాలలో రెండు మృతదేహాలను బయటకు తీశాయి.
ఈ ప్రమాదంలో శిథిలాల కింద పడి బాలిక సాకేటి అంజలి(14), ఆమె సోదరుడు దుర్గాప్రసాద్(17) మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది ఈరోజు (గురువారం) ఉదయం వెలికితీశారు. మృతుడు బిహార్‌కు చెందిన చోటు (27)గా అధికారులు గుర్తించారు. వీరిలో అంజలి పదోతరగతి చదువుతోంది.. ఆమె సోదరుడు దుర్గ ప్రసాద్ ఇంటర్ చదువుతన్నాుడ. గాయపడిన వారిని కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణిగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన అందరని పోలీసులు చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు.సంఘట స్థలాన్ని డీసీపీ సుమిత్ గరుడ పరిశీలించారు.
అయితే ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే విజయవాడకు చెందిన కొమ్మిశెట్టి శివశంకర్ నూడిల్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. గత వారం నుంచి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నట్టు చెప్పాడు. బీహార్‌కు చెందిన చోటు కూడా ఉంటున్నారు.
అలాగే ఈ ప్రమాదంలో శిథిలాల కింద పడి చనిపోయినా బాలిక సాకేటి అంజలి(14), నిన్న 15 పుట్టిన రోజు కావడంతో రాత్రి అందరూ చాలా సేపువరకు ఆ వేడుకాలలో చాలా సంతోషంగా సరదాగా గడిపారు . కానీ వీధి రాత అన్నట్టు ఆ వేడుకలు మరవక ముందే భవనం రూపంలో అ చిన్నారిని మృత్యు కబాలించింది.