viveka murder case :వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీని రామ్సింగ్ను తొలగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. వేయనున్నారు. రాంసింగ్ వల్లే వివేకా హత్య కేసు విచారణ ఆలస్యం అయిందని, దర్యాప్తు వేగంగా సాగటం లేదని ఏఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారిగా రాంసింగ్‌ను తొలగిస్తూ సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగటం లేదని. దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.
గత విచారణలో దర్యాప్తు అధికారిని మార్చాలని. లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక అందజేసింది. రాంసింగ్‌తో పాటు మరొకరి పేరును సీబీఐ సూచించింది. అయితే రాంసింగ్‌ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్‌ను కొనసాగించడంలో అర్ధం లేదని న్యాయమూర్తి అన్నారు. వివేకా కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తొలగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను కడపలో రకరకాలుగా ఇబ్బందులను గురి చేశారు. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న వారిలో దర్యాప్తు అధికారి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఒకరు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని. కొంతమందికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని బెదిరిస్తున్నారని వివేకా కేసులో అనుమానితుడిగా ఉన్న ఉదయ్‌కుమార్ రెడ్డి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై కడప పోలీసులు కేసు కూడా పెట్టారు. ఉదయ్‌కుమార్ ఎంపీ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడని పేరుంది. రాంసింగ్‌పై అనంతపురం, కడప ఎస్పీలకు కూడా ఫిర్యాదులు చేశారు. తాజాగా అవినాష్ రెడ్డి కూడా సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను మార్చాలని. తనను అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలని తన స్టేట్మెంట్ ఆడియో, వీడియో రికార్డు చేయాలని, సీబీఐ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం. అవినాశ్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసింది. అరెస్టు చేయవద్దని సీబీఐకి చెప్పలేమని స్పష్టం చేసింది. అయితే సరిగ్గా ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనమై వెళ్లారు.
రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి మకాం వేయనున్నారు. ఈనెల 16న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా సెషన్స్‌ను పక్కన పెట్టి మరీ హస్తినకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లడంఅది కూడా సుప్రీం ఆదేశాల తర్వాత హస్తిన పర్యటనతో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.కాగా సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వివేకా హత్య కేసు లో కీలక పరిణామం చోటుచేసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.