కాలినొప్పి కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి వైఎస్సార్ జిల్లా పర్యటన రద్దు చేసుకున్నట్లు ఏ.పీ సి.ఎం.ఓ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ఆయనకు కాలు బేనకడంతో సాయంత్రానికి నొప్పి తీవ్రత పెరిగింది. గతంలో కూడా ఇలానే కాలికిగాయం ఏయినట్లు చాలారోజులపాటు జగన్ ఆ నొప్పితో ఇబ్బందిపడ్డట్టు సి.ఎం.ఓ ఆ ప్రకటనలో పేర్కొంది . దాంతో ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచించదాంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు అని పేర్కొన్నారు.
ఏ.పీ సి.ఎం ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు కాలినొప్పి*. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.
కాగా రేపు అనగా 5వ తేదీన ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం నేపథ్యంలో సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి వెళ్లాలిసి ఉంది కానీ ఆయనకు కాలినొప్పి కారణంగా ముఖ్యమంత్రి ఆ పర్యటన రద్దు చేసుకున్నారు.
కాగా, ఏప్రిల్ 5వ తేదీన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. కల్యాణోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కలిసి శ్రీరామ నామామృతం భజన కార్యక్రమం అనంతరం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దుబాల పర్యవేక్షణలో శ్రీరామకృతులు నృత్య కార్యక్రమం జరుగును. తరువాత శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమవుతుంది.
కల్యాణం అనంతరం రాత్రి 11 గంటలకు గజవాహన సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. మళ్లింపు ఈ నెల 5 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి అమలులో ఉంటుందని ఆయన తెలిపారు
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు కాలినొప్పి*. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 4, 2023