ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన ఏపీ సిఎం

AP CM:ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన ఏపీ సిఎం జగమోహన రెడ్డి

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. పక్కా స్కెచ్ తో రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించి రెండు రోజులైంది. అయితే ఈ భేటీపై చర్చలు ముగియలేదు. సీఎం జగన్ ఏం మాట్లాడారనే దానిపై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో ముందుకు వెళ్తున్న సమయం నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు వేసిన వేళ సీఎం జగన్ పార్టీ నేతలతో తన ఆలోచనలను షేర్ చేసుకునున్నారు.
సమీక్షా సమావేశంలో తన రాజకీయాలు మానవ సంబంధాలతో నిండి ఉన్నాయని ఘాటుగా చెప్పారు. ఇది నేను మా నాన్నగారి నుంచి నేర్చుకున్నానని జగన్ అన్నారు. ప్రజలతో సంబంధాలు ఇంకా కొనసాగుతాయని చెప్పారు. ఈ విషయాలన్నీ సమావేశంలో ఎమ్మెల్యేలను సంతోషపెట్టాయి. చప్పట్లు కూడా కొట్టారు అయితే ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న సందేశం దాగి ఉందని పరిశీలకులు అంటున్నారు. ఎవరికైనా టిక్కెట్ రాకపోతే ఎమ్మెల్సీ సీటు లేదా కార్పొరేషన్ సీటు ఇస్తామని జగన్ చెప్పినట్లు సమాచారం. 2029లో సీట్లు పెరగనున్నందున వారందరికీ ప్రాధాన్యత కల్పిస్తారు.

తన ప్రసంగంలో అందరికీ టిక్కెట్టు వస్తుందని జగన్ హామీ ఇవ్వలేదు. రాని వారికి ఇతర మార్గాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పని చేయని నేతల పేర్లు తన వద్ద ఉన్నాయని జగన్ పరోక్షంగా హింట్ ఇచ్చారా అనే విషయంపై అంతర్గతంగా చర్చ సాగుతోంది. 2029 ఎన్నికల నాటికి ఎమ్మెల్యే సీట్లు 225కి పెరుగుతాయని, మరో 50 సీట్లు వస్తాయని జగన్ చెప్పారు. తద్వారా 50 మంది నేతలకు టిక్కెట్లు రాని ప్రమాదం నెలకొంది.

ఆ 50 మంది నేతలకు పార్టీ టిక్కెట్లు రాకపోవచ్చని, ఆరేళ్లు ఆగితే 2029 ఎన్నికల్లోనూ మళ్లీ అవకాశం వస్తుందని జగన్ పరోక్షంగా సూచించినట్లు చర్చ సాగుతోంది. వీరిలో కొందరికి ఇతర టిక్కెట్లు లభించే అవకాశం ఉంది. దీన్నిబట్టి జగన్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లు అర్థమవుతోంది. ప్రమాదంలో ఉన్న 50 మంది సభ్యులు ఎవరనేది మరో పెద్ద చర్చ. అయితే ఈసారి ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదని,  దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ప్రమాదంలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ఆ 50 మంది నేతలు ఎవరనేది వేచి చూడాల్సిందే.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh