YSRCP Party మూడు రాజధానుల కోసం వైసీపీ బైక్ ర్యాలీ

YSRCP Party మూడు రాజధానుల కోసం వైసీపీ బైక్ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ఉద్యమం క్రమంగా ఊపందుకుంటోంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో విశాఖపట్నం వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖను రాజధాని చేయాలంటూ గంధవరం నుంచి చోడవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో మేధావులు, టీచర్లు సహా వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చోడవరంలోని కొత్తూరు జంక్షన్ లో మానవహారం చేపట్టారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులే ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందేందుకు ఆస్కారం ఉంటుందని వారు అన్నారు. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి లాభమే తప్పా.. నష్టం లేదని తెలిపారు.

2. ఫ్లోరైడ్‌ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్‌ మునుగోడు నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని గతంలో ఆయనకు మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లుతోపాటు ప్రభుత్వం తరఫున ఐదున్నర లక్షల రూపాయలు మంజూరు చేయించారు.
మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా వచ్చారు.
అంశాల స్వామితోపాటు ఆయన తల్లిదండ్రుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి ఇంట్లోనే భోజనం చేశారు.

 

3. టీఆర్ఎస్ గెలిస్తే మునుగోడు దత్తత తీసుకుంటానని ప్రకటన

మునుగోడు ఉపఎన్నిక.. కాంట్రాక్టర్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మనుగోడు నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజక వర్గానికి వచ్చి అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. రోడ్లను బాగు చేయిస్తానన్నారు. తన మాట మీద విశ్వాసం ఉంచి.. టీఆర్‌ఎస్‌ను గెలిపించమని కోరారు.

4. ఏపీ – తెలంగాణను కలుపుతూ భారీ కేబుల్ బ్రిడ్జిరెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా నదిపై రూ.1, 082.56 కోట్లతో ఐకానిక్ తీగల వంతెన నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సిద్దేశ్వరం, సోమశిల మధ్య ఈ నిర్మాణం 30 నెలల్లో పూర్తి అవుతుందని గురువారం ట్విట్టర్ లో ప్రకటించారు. చుట్టూ విశాలమైన శ్రీశైలం జలాశయం, నల్లమస అడవి, ఎత్తైన పర్వతాల మధ్య నిర్మించే ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని తెలిపారు. తెలంగాణ వైపున లలితాసోమేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్ వైపున సంగమేశ్వర ఆలయాన్ని చూడటానికి ఇదో కేంద్రంగా మారుతుందని అన్నారు.

5. చేసిన పని చెప్పుకోవడం సెల్ఫ్ డబ్బా కాదు,

తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర లేని పేరు. విలన్ గా సినీ కెరీర్ మొదలు పెట్టి ప్రముఖ హీరోగా ఎదిగారు.ఆయన పిల్లలు కూడా సినిమా రంగంలో అడుగు పెట్టారు. మంచు లక్ష్మీ ప్రసన్న, విష్ణు, మనోజ్ పలు సినిమాల్లో నటించారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ సాలిడ్ హిట్ తగల్లేదనే చెప్పుకోవచ్చు. గతేడాది జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకొని ఏడాది అయిన సందర్భంగా మంచు విష్ణు ఓ సమావేశం ఏర్పాటు చేశాడు.

ఇందులో పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేసిన పనుల కంటే గొప్పగా మంచు విష్ణు పని చేస్తున్నాడని ప్రశంసించారు. ఇదే సమయంలో పొగిడితే సెల్ఫ్ డబ్బా అంటారని కామెంట్ చేశారు. చేసిన పని చెప్పుకోవడంలో తప్పులేదన్నారు.

6. అన్నదాతకు శుభవార్త..

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన: దేశంలోనే అతిపెద్ద పండుగ దీపావళి సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. ఎంతో రైతులకు మేలు చేసేలా పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని రైతులంతా ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 12వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు వచ్చే వారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.

7.మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజ పేరు ఇదేనా..?

వాల్తేరు వీరయ్య సినిమా పక్కా మాస్ మసాలా మూవీగా రానుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి మత్యకారుడిగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే రవితేజ ఏ పాత్రలో కనిపించనున్నడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఆ పాత్రకి సంబంధించి మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. రవితేజ వైజాగ్ రంగారావు అనే పాత్రతో కనిపించనున్నారుట. రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. రవితేజ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడా? వీరయ్యకి సోదరుడిగా రంగారావు పాజిటివ్ గా కనిపిస్తాడా? అన్నది తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ రానుంది. చేస్తున్నారు చిరు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh