YSRCP: CM Jagan Attack | Pause for CM Jagan’s bus trip.

YSRCP: CM Jagan's bus trip |Many people stand in solidarity against the attack.

YSRCP: Pause for CM Jagan’s bus trip. Many people stand in solidarity against the attack.

 

YSRCP: CM Jagan Attack | Pause for CM Jagan’s bus trip. సీఎం జగన్ బస్సుయాత్రకు విరామం.. దాడిపై పలువురి సంఘీభావం..ఏపీ సీఎం వైఎస్ జగన్ తలకు తీవ్రమైన గాయమైంది. శనివారం రాత్రి మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు మూడు కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కారణంగా ఆదివారం జరగాల్సిన బస్సుయాత్ర రద్దు అయినట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. తదుపరి షెడ్యూల్‎ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని తెలిపాయి పార్టీ వర్గాలు. దీనిపై పలువురు రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు స్పందించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మొన్నటి వరకు సిద్దం పేరుతో బహిరంగసభలు నిర్వహించిన సీఎం జగన్.. ప్రస్తుతం మేమంతా సిద్దం అంటూ బస్సుయాత్ర చేపట్టారు. తన పాలనలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ది గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది బస్సుయాత్ర. ఈ నేపథ్యంలో సింగ్ నగర్ నుంచి వివేకానంద స్కూల్ పరిసర ప్రాంతాల్లో పథకం ప్రకారం క్యాట్‎బాల్‎తో రాళ్లదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సీఎం జగన్ కు ప్రత్యేక చికిత్స అందిచారు వైద్యులు.

ప్రస్తుతం సీఎం జగన్ కు ప్రత్యేక చికిత్స అందిచారు వైద్యులు. ఎడమకన్ను పైభాగంలో బలమైన గాయం తగిలినట్లు చెబుతున్నారు డాక్టర్లు. రాయి లోతుగా దిగిందని అందుకే మూడు కుట్లు వేసినట్లు ప్రకటించారు విజయవాడ జీజీహెచ్ వైద్యులు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచిస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. డాక్టర్ల సూచనమేరకు ఈరోజు విశ్రాంతి తీసుకోనున్నారు సీఎం జగన్. చికిత్స తరువాత కేసరపల్లికి చేరుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మేమంతా సిద్దం బస్సుయాత్ర రద్దయినట్లు ప్రకటించింది వైసీపీ. తదుపరి షెడ్యూల్‎ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని తెలిపారు వైసీపీ నేతలు. సీఎం జగన్‎పై జరిగిన దాడిని పలువురు నేతలు స్పందించారు. అలాగే ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ఫోన్ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. రేపటిలోగా ఘటనకు గల కారణాలు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చేపడుతున్ఏ

వైఎస్ జగన్‎పై జరిగిన రాళ్ల దాడిపై ప్రధాని మోదీ స్పందించారు

పీ సీఎం వైఎస్ జగన్‎పై జరిగిన రాళ్ల దాడిపై ప్రధాని మోదీ స్పందించారు. ఇలాంటి చర్యలు బాధాకరం అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ సీఎం జగన్‎పై రాళ్ల దాడి జరగడాన్ని ఖండించారు. సీఎం జగన్ క్షేమంగా ఉన్నందుకు సంతోషం అన్నారు. దీనిపై ఈసీ చర్యలు చేపట్టాలన్నారు.
జగన్‎పై దాడి దురదృష్టకరం అన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎడమకంటికి గాయం కావడం బాధాకరం అన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నారు.
అలాగే పొరుగురాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని సూచించారు. రాజకీయ విబేధాలు దాడులకు దారితీయకుడదన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందింస్తూ.. సీఎం జగన్ పై దాడి విషయం విని షాక్ కు గురయ్యా అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఇలాంటి ఘటనలు జరగకూండా చర్యలు తీసుకోవాలన్నారు.YSRCP: CM Jagan Attack | Pause for CM Jagan’s bus trip.

YSR Congress blames TDP for attack on Jagan

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh