YSR Rythu Bharosa: నేడు వైఎస్సార్ రైతు భరోసా నగదు జమ
YSR Rythu Bharosa: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ ఉదయం 7.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి చేరుకుంటారు.
అక్కడ సీ కే కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ నేత పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సోదరుడు పేర్నాటి
రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.
అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయులుదేరుతారు.
ఆ తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా వైయస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం
లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిషు మీడియం
స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికకు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు
చేసిన బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం వైయస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం సీఎం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
వైఎస్సార్ రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయంతో పాటు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన
రైతన్నలకు సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
2023-24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున
మొత్తంYSR Rythu Bharosa: రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్,
మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల
మేర ఇన్పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే
కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ ముగియక ముందే పంట
నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తూ బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మార్చి,
ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల 78,830 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 51,468 మంది రైతులకు పంట
నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రూ.53.62 కోట్ల పంట నష్టపరిహారాన్ని, పెట్టుబడి సాయంతో కలిపి 22.73
లక్షల మంది రైతులకు లబ్ధి అయితే చరిత్రలో ఎన్నడూ YSR Rythu Bharosa: లేనివిధంగా నాలుగేళ్ల వ్యవధిలో
సీఎం జగన్ ప్రభుత్వం రైతన్నలకు వివిధ పథకాల ద్వారా రూ.1,61,236.72 కోట్ల మేర నేరుగా సాయాన్ని అందించడం గమనార్హం.