YS Avinash Reddy:విషమంగాఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్యo
YS Avinash Reddy- కడప మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోఆరోపణలు ఎదురుకుంటున్న
కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేడు సిబిఐ విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి వ్యవహారం లో ఆసక్తి నెలకొంది.
తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుండంతో ఈ రోజు విచారణ కు రాలేనని సమాచారం ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ బృందాలు కర్నూలు చేరుకున్నాయి.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ఆమెకు నాన్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉందని పేర్కొన్నారు.
ఆమె యాంజియోగ్రామ్ డబుల్ నాళాలYS Avinash Reddy- వ్యాధితో బాధపడుతున్నారన్నారు.
ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షణలో సీసీయూలోలో ఉన్నారని వివరించారు. ఆమె రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని, ఆమె అ
యానోట్రోపిక్ సపోర్ట్‌లో ఉందన్నారు.
ప్రస్తుతం వాంతులు అదుపులోకి వచ్చాయని నోటితో శ్వాస తీసుకోవడం కూడా తగ్గిందన్నారు.
అల్ట్రాసౌండ్ చేసి ఉదరం, మెదడు ఇమేజింగ్ ప్లాన్ చేస్తున్నామమన్నారు వైద్యులు.
ఆమెకు బిపి తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు ఐసియులో ఉండవలసి ఉందన్నారు.
అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో విశ్వభారతి హాస్పిటల్ చుట్టూ పోలీస్ బలగాలు మోహరించాయి.
దీంతో ఆయనకు సంఘీభావంగా వైసీపీ కార్యకర్తలు హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు.
పోలీసులు మాత్రం వారికి నచ్చజెప్పి వెనక్కి పంపుతున్నారు.
అవినాష్‌కు సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.
కర్నూలులో పరిస్థితిపై సీబీఐ ఉన్నతాధికారుల ఆరా తీస్తు్నారు.
ఢిల్లీ నుంచి స్థానిక పోలీసు అధికారులతో సీబీఐ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
కర్నూలులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ సీబీఐ ఆఫీస్ కు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు , జిల్లా ఎస్పీకి
లిఖిత పూర్వకంగా అవినాష్ రెడ్డి వ్యవహారంపై సమాచారాన్ని అందచేసినట్లు తెలుస్తోంది.
అయితే వరుసగా మూడుసార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అవినాష్ రెడ్డిని YS Avinash Reddy- అదుపులోకి
తీసుకునే అధికారం ఉందని సీబీఐ జిల్లా పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.