YCP: ముఖ్య నేతలతో సీఎం జగన్‌ భేటీ..

YCP

YCP: ముఖ్య నేతలతో సీఎం జగన్‌ భేటీ.. ఎందుకంటే ?

YCP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా అరెస్టు కావడం, ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరు అవుతుండడంతో అసలు ఏం జరుగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. నిన్న అరెస్ట్ చేసిన వైయస్ భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా అవినాష్ రెడ్డి సహా నిందితుడిగా సిబిఐ పేర్కొంది. దీంతో YCP నేతలలో కల్లోలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైబి సుబ్బారెడ్డి తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. వైయస్ వివేకా హత్య కేసు కు సంబంధించి తాజా పరిణామాలపై వారితో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. నేడు ఉదయం పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరుకానున్నారు. నిన్న (ఆదివారం) అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ. హైదరాబాద్‌కు తరలించి వైద్య పరీక్షల అనంతరం సీబీఐ కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 29వరకు రిమండ్ విధించింది వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో భేటీకావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ముఖ్య నేతలతో సీఎం జగన్‌ భేటీ.. ఎందుకంటే ?

తాజాగా నిన్న  వివేకా హత్య కేసులో కుట్రదారుడిగా వైఎస్ భాస్కర్‌ రెడ్డిపై ఉన్న అభియోగాలతో సీబీఐ ఆదివారం రోజున ఆయనను పులివెందులలో అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి.. సీబీఐ జడ్జి ముందు హాజరుపరిచింది. దీంతో భాస్కర్ రెడ్డికి 14 రోజులు (ఈనెల 29 వరకు) రిమాండ్ విధించడంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అసలు అవినాష్ రెడ్డి YCP ఎంపీ మాత్రమే కాదు సీఎం జగన్‌కు సోదరుడు అవుతారు.  కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కావడంతో పాటు ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి కుటుంబానికి జగన్ మద్దతుగా ఉంటున్నారు. అదే సమయంలో  సీఎం జగన్ సతీమణి భారతి అటెండర్ నవీన్ , సీఎం జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డిలను సీబీఐ విచారణ జరిపింది. వారికి అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారు జామున ఫోన్ చేసినట్లుగా కాల్ రికార్డ్స్ ఉండటంతో ఈ విచారణ జరిపింది. అందుకే ఈ కేసు విషయంలో సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి  పెట్టారని న్యాయనిపుణులతోనూ మాట్లాడుతున్నారని YCP వర్గాలు చెబుతున్నాయి.

వివేకా హత్యకు వేరే కారణాలు వున్నాయి అని  అంటున్నాడు అవినాష్ రెడ్డి . అసలు  అవినాష్ రెడ్డికి కానీ ఆయన కుటుంబానికి ఏమీ సంబంధంలేదని జగన్ అసెంబ్లీలో చెప్పారు. ఈ హత్య ఘటనలో జరుగుతోందంతా తప్పుడు ప్రచారమేనంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి  వైఎస్ వివేకా చేసుకున్న  రెండో పెళ్లి వల్లనే ఈ హత్య జరిగిందని కోర్టుకు చెబుతున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి వివాహేతర బంధం వల్ల ఈ హత్య జరిగిందని  వాదిస్తున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh