వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం
Y S Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5లోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. జూలై 1న దర్యాప్తు పూర్తి చేసి గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. రూ.లక్షన్నర షూరిటీలతో బెయిల్ ఇవ్వాలని సూచించింది.
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రధాన నిందితుడని. సాక్షులను ఆయన బెదిరించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. కీలక నిందితుడు బయట ఉంటే.. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పేర్కొంది. సీబీఐ వాదనతో సునీత తరుఫు లాయర్లు ఏకీభవించారు. Y S Viveka హత్య కేసు విచారణ కీలక దశలో ఉందని సీబీఐ చెప్పింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. మే 5లోగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించారు. మరోవైపు సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో దూకుడు పెంచారు. పులివెందులలో వివేకా పీఎ కృష్ణారెడ్డికి మరోసారి వెళ్లారు. కృష్ణారెడ్డితోపాటు మరికొందరికి నోటీసులు జారీ చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసు
2019 జూన్ 27న గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నాడని సిబిఐ ఆరోపిస్తోంది. Y S Viveka హత్య కేసును తొలినాళ్లలో విచారించిన సిట్ బృందంతో పాటు తర్వాత ఏర్పాటైన రెండో సిట్ కూడా గంగిరెడ్డి పాత్రను నిర్దారించాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ ప్రారంభమైన తర్వాత గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంతో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయడానికి ఏపీ హైకోర్టు అనుమతించలేదు. అన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి వ్యవహారంపై సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గతంలో ఏపీ హైకోర్టులో సానుకూల స్పందన లభించకపోవడాన్ని సిబిఐ వివరించింది. కేసు విచారణ పరిధిని తెలంగాణ హైకోర్టుకు మార్చడంతో గంగిరెడ్డి వ్యవహారంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డి బయట ఉంటూ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. వీరిలో ఏ1, ఏ4 దస్తగిరి బయట ఉండగా, మిగిలిన ఐదుగురు జైల్లోనే ఉన్నారు.
అలాగే మరోవైపు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు సీబీఐ రెడీ అవుతోంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా గురువారం తీర్పు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ విషయం తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే. దీంతో నేడు హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.