Wrestlers Talks: మరోసారి చర్చలకు రావాలని కేంద్రo పిలుపు

Wrestlers Talks

Wrestlers Talks: మరోసారి చర్చలకు రావాలని కేంద్రo పిలుపు

ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు పోరాడుతున్న సంగతి తెలిసిందే.  బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వారు ఆరోపిస్తున్నారు. అయితే  రెండు రోజుల క్రితం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రెజ్లర్లు, వారి కోచ్‌లు సమావేశమయ్యారని మీడియాకు తెలియజేశారు. సమస్యను పరిష్కరిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని పూనియా తెలిపారు.

అయితే ఇప్పుడు  ప్రభుత్వం మళ్లీ రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రీడా మంత్రి ట్వీట్ చేస్తూ రెజ్లర్లతో వారి సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించినట్లు తెలిపారు. రాత్రి మంత్రి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రోజు సాయంత్రానికి చర్చలు జరిగేలా ఉన్నట్టు తెలుస్తోంది.

అలాగే సోమవారం రోజు రెజ్లర్లు తమ ఉద్యోగాల్లోకి తిరిగి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తమ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. తమ జీవితం ప్రమాదంలో ఉందని.. దాని ముందు ఉద్యోగం చాలా చిన్న విషయం అని తెలిపారు. ఉద్యోగం న్యాయానికి అడ్డంకిగా కనిపిస్తే దాన్ని వదిలేయడానికి పది సెకన్లు కూడా పట్టవని తెలిపారు. ఉద్యోగ భయాన్ని ప్రదర్శించ వద్దని తెలిపారు. మరో ట్వీట్‌ లో రెజ్లర్ బజరంగ్ పునియా దేశ ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు.

మరోవైపు ఒలింపిక్స్ లో భారత్ కు మెడల్ తీసుకొచ్చిన రెజ్లర్ భజరంగ్ పూనియా మాట్లాడుతూ కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అన్నారు. తమ నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగిపోలేదని, తమ కార్యాచరణను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే వ్యూహంపై ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇంకోవైపు, ఏడుగురు మహిళా రెజ్లర్లు (వీరిలో ఒకరు మైనర్) బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయనపై పారదర్శకంగా విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh