మార్చి 4 నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మ్యాచ్‌లు ప్రారంభం

women’s premier league kicks off on march 4

మార్చి 4 నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మ్యాచ్‌లు ప్రారంభం

రేపు (శనివారం) ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2023) 2023  మ్యాచ్‌లు ప్రారంభంకాబోతున్నాయి. టోర్నీలో మొత్తం ఐదు జట్లు పోటీపడుతుండగ మార్చి 4 నుంచి మార్చి 26 వరకూ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకి, రాత్రి 7:30 గంటలకి స్టార్ట్‌ అవుతాయి. అన్ని మ్యాచ్‌లనూ ముంబయిలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించబోతోంది. డబ్ల్యూపీఎల్ -2023 సీజన్‌‌ 18 రోజుల పాటు జరగనుండగా. మొత్తం 22 మ్యాచ్‌లు ఉన్నాయి ఇందులో డబుల్ హెడర్ మ్యాచ్‌లు నాలుగు మాత్రమే. మార్చి 4 నుంచి మార్చి 21 వరకూ లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మార్చి 24న ఎలిమినేటర్, మార్చి 26న ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. ముంబయిలోని డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియంలోనే మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి.

టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రూపంలో ఐదు జట్లు పోటీపడబోతున్నాయి. ప్రతి జట్టూ లీగ్ దశలో ఎనిమిదేసి మ్యాచ్‌లను ఆడుతుంది. టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుండగా రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో పోటీపడుతుంది. ముంబయి ఇండియన్స్ టీమ్‌ని కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నడిపించనుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైంది. అలానే ఢిల్లీ క్యాపిటల్స్‌కి మెక్ లానింగ్, గుజరాత్ టైటాన్స్‌కి బెత్ మూనీ, యూపీ వారియర్స్‌కి హీలీ కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యారు. శనివారం జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్లు రాత్రి 7:30 గంటలకి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh