Women’s Day: #takeabow2women
Women’s Day: మనకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది ఆమె. మనం ఆరోగ్యంగా ఎదుగుతున్నామంటే కారణం ఆమె. మనం జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నామంటే కారణం ఆమె. వేకువ జాము నుండి వెన్నెల రేయి దాకా ఇంటిల్లిపాదినీ కంటికి రెప్పలా తన కష్టం తో కాపాడుతుంది ఆమె.
మన జీవితంలోని తల్లి కాని, భార్య కాని ఇంకెవరైనా అవ్వచ్చు, తన జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను సైతం మన జీవితం కోసం త్యాగం చేసి మన జీవితాన్ని జీవించడానకి అంకురార్పణ అయిన అతివలను అభినందించడానికి మీముందుకు ఓ వినూత్న నినాదాన్ని తీసుకువచ్చింది మీ ప్రజ్ఞ మీడియా. అదే #takeabow2women.
మీ జీవితంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన మహిళ గురించి ఒక నిమిషం పాటు మాట్లాడి పది సెకన్లు ఆమెకు మనస్ఫూర్తిగా నమస్కరించి ఆ వీడియోను +917032374439 పంపండి. రాబోయే అంతర్జాతీయ మహిళా దీనోత్సవం నాడు మన మహిళల కోసం చేసే ఈ అరుదైన అభినందనను ఆమె కోసం అందిద్దాం. నిజమైన మహిళా దీనోత్సవాన్ని మన మహిళలకు కానుకగా ఇద్దాం.