Virat Kohli మాత్రం మరో ప్రపంచకప్ ఆడతాడు…

Virat Kohli రోహిత్ రిటైర్ అవుతాడు కానీ.. కోహ్లీ మాత్రం మరో ప్రపంచకప్ ఆడతాడు.

virat kohli టీ20 ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన టీమిండియా.. అందరికీ షాకిస్తూ ఇంటి దారి పట్టింది. గ్రూప్ దశలో అద్భుతమైన పోరాటపటిమ చూపించిన భారత జట్టు.. కీలకమైన నాకౌట్ దశకు వచ్చేసరికి చేతులెత్తేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో బ్యాటర్లుకానీ, బౌలర్లు కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీనిపై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మోంటీ పనేసర్ కూడా స్పందించాడు.భారత జట్టు సెమీఫైనల్‌లో అసలు పోరాటమే చూపలేదని పనేసర్ అన్నాడు. అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ ఇద్దరి ముందు భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డాడు. ‘168 తక్కువ స్కోరు కాదు. కానీ భారత బౌలర్లు అసలు క్లూలెస్‌గా కనిపించారు. సెమీస్ ఆడుతూ ఏమాత్రం పోరాటం చూపకపోవడం షాకింగ్ విషయం. ఆ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది’ అని తేల్చిచెప్పాడు పనేసర్.సాధారణంగా వరల్డ్ కప్ నుంచి పెద్ద జట్లు నిష్క్రమించినప్పుడు..

జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అవడం మామూలే. కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడానికి పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి, వన్డే-టెస్టు ఫార్మాట్‌లపై ఫోకస్ పెడుతుంటారు. ఇదే విషయాన్ని చెప్పిన పనేసర్.. భారత జట్టులో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్ ముగ్గురూ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందన్నాడు. ‘వచ్చే ప్రపంచకప్ నాటికి రోహిత్ వయసు 37 అవుతుంది. ఆ వయసులో అతను ప్రపంచకప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు’ అని చెప్పాడు.

అదే సమయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం వచ్చే ప్రపంచకప్ కూడా ఆడే అవకాశం ఉందని పనేసర్ అంటున్నాడు. 34 ఏళ్ల Virat Kohli భారత జట్టులో అందరి కన్నా ఫిట్‌గా ఉన్న ఆటగాడని, అతనికి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అభిప్రాయపడ్డాడు. కాబట్టి Virat Kohli వచ్చే టీ20 ప్రపంచకప్ కూడా ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఛీ.. ఒక టీవీ షో కోసం విడాకుల నాటకం… వీళ్ళేం ప్లేయర్స్..

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు జరిగిన ప్రచారం అంత ఉత్తదేనని తేలింది. ఓ టీవీ టాక్ షో ప్రమోషన్స్ కోసం ఈ జోడీ ఈ విడాకుల నాటకం ఆడినట్లు స్పష్టమైంది. ఇక షోయబ్ మాలిక్ పాకిస్థాన్ మోడల్ అయేషా ఒమర్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఇది తెలిసి సానియా మీర్జా విడాకులు ఇచ్చేందుకు సిద్దమైందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఏ మాత్రం ఖండించని సానియా-షోయబ్ వాటికి బలం చేకూర్చేలా సెటైరికల్ ట్వీట్స్ చేశారు.

ముఖ్యంగా సానియా తన కొడుకు ఇజాన్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి’కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే క్షణాలు’అంటూ క్యాప్షన్‌గా పేర్కొంది. ఆ తర్వాత ‘ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది’అని మరో పోస్ట్ పెట్టింది. ఈ రెండు పోస్ట్‌లు సానియా బాధలో ఉన్న విషయాన్ని తెలియజేయగా.. అప్పుడే మాలిక్‌తో విడాకులనే పుకార్లు వెలువడ్డాయి. దాంతో జనాలంతా ఇది నిజమేనని నమ్మారు. షోయబ్ మాలిక్‌పై దుమ్మెత్తిపోసారు. బంగారం లాంటి పెళ్లాన్ని ఇంట్లో ఉంచుకొని పరాయి స్ట్రీ మోజులో పడటం ఏంటని మాలిక్‌కు చివాట్లు పెట్టారు.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసేసుకున్నారు. సెపరేషన్స్‌కి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తియిపోయాయి.’ అంటూ మాలిక్ మేనేజర్ కామెంట్ చేశాడంటూ వార్త కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ తాజాగా ఉర్దూ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సానియా మీర్జా- షోయబ్ మాలిక్ కలిసి నిర్వహించబోతున్న టీవీ టాక్ షోకు సంబంధించిన పోస్టర్‌ను పంచుకుంది.

ఈ ప్రోగ్రామ్‌కు ‘ది మీర్జా మాలిక్ షో’ అని పేరు పెట్టినట్లు ఈ పోస్టర్ ద్వారా తెలిసింది. ఈ పోస్టర్ చూసిన అభిమానులకు సానియా-మాలిక్‌ల నాటకం అర్థమైంది.ఈ టాక్ షోకి పాపులారిటీ, క్రేజ్ తెచ్చేందుకు మీర్జా మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్‌ పుట్టించారే విషయం బోధపడింది. ఈ రూమర్స్ అన్నీ ఈ టాక్ షోకి క్రేజ్ తెచ్చేందుకు చేసిన మార్కెటింగ్ ఎత్తుగడగా తేలింది.

దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నెటిజన్లు సానియా జోడీపై మండిపడుతున్నారు. ఓ టీవీ షో కోసం ఇంత దిగజారాలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాన్ బెడిసి కొడుతదని, ఆ షోను ఎవరూ చూడరని శాపనార్దాలు పెడుతున్నారు.మీ స్వార్థం వల్ల అభం శుభం తెలియని అయేషా ఒమర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొందని, ఆమె క్యారక్టర్ బ్యాడ్ అయిందని మండిపడుతున్నారు.

ఇది ఏ మాత్రం సహించే విషయం కాదని దుమ్మెత్తిపోస్తున్నారు. సరిహద్దులు ధాటి ప్రేమించుకున్న సానియా-మాలిక్ 2010లో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 2018లో వీరికి ఇజాన్ మీర్జా జన్మించాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాదిన్నర పాటు టెన్నిస్‌కి బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా, కొడుకుతో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది. మాలిక్‌ను చేసుకోవడం వల్ల సానియా.. చాలా విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్‌ల సందర్భంగా నెటిజన్లు సానియానే టార్గెట్ చేసేవారు.

IPL 2023: కేకేఆర్‌లోకి శార్దూల్ ఠాకూర్..

ఐపీఎల్ 2023 రిటెన్షన్ ప్రక్రియను మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌(కేకేఆర్) ట్రేడ్ విండోతో పూర్తి చేయాలని భావిస్తున్నట్లుంది. ఇప్పటికే ట్రేడ్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి లాకీ ఫెర్గూసన్, రహ్మనుల్లా గుర్బాజ్‌లను తీసుకున్న ఆ జట్టు.. తాజాగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్యాష్ డీల్‌తోనే శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ తమ జట్టులోకి తెచ్చుకుందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫో పేర్కొంది.

అప్‌కమింగ్ సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియకు బీసీసీఐ నవంబర్ 15 డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రాంఛైజీలు ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో పడ్డాయి. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఈ టీమిండియా ఆల్‌రౌండర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీపడటంతో ఢిల్లీ భారీ ధర వెచ్చించాల్సి వచ్చింది. అయితే శార్దూల్‌తో తమ జట్టుకు వచ్చిన ఫైదా ఏం లేదని భావించిన ఢిల్లీ.. కేకేఆర్‌తో డీల్ చేసుకొని వదిలించుకుంది. కేకేఆర్‌కు

కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ సరైన బౌలింగ్ అటాక్ లేక తడబడింది. దాంతోనే ఆ సమస్యను అధిగమించడంపై ఫోకస్ పెట్టిన కేకేఆర్.. ఫెర్గూసన్, ఠాకూర్‌లను ట్రేడ్ విండో ద్వారా సొంతం చేసుకుంది. ఇప్పటికే సామ్ బిల్లింగ్స్, ప్యాట్ కమిన్స్ అప్‌కమింగ్ సీజన్‌కు దూరంగా ఉంటామని చెప్పిన నేపథ్యంలో ఆ స్థానాలను భర్తీ చేయడంపై కేకేఆర్ ఫోకస్ పెట్టింది.

ఇక శార్తూల్ ఠాకూర్ ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి ఆ జట్టు నాలుగో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

డేవిడ్ వార్నర్ ఎకసెక్కాలు మాములుగా లేవ్‌గా..! వీడియో వైరల్.

ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో స్పూఫ్ వీడియో‌తో అలరించాడు. తెలుగు అభిమానులనే లక్ష్యంగా చేసుకొని ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌గా తెలుగు ప్రజలతో వార్నర్‌కు విడదీయరాని బంధం ఉంది. భారత్‌ను తన రెండో ఇళ్లుగా పరిగణించే వార్నర్.. హైదరాబాద్‌ తన సొంతగడ్డగా ఫీలవుతాడు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ చెబుతూ.. సాంగ్స్‌కు చిందేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు.లాక్‌డౌన్‌లో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాల సాంగ్స్‌కు చిందేసాడు. ఆ వీడియోలను అభిమానులతో పంచుకొని టాలీవుడ్ టాప్ హీరోలు, డైరెక్టర్ల మన్ననలు అందుకున్నాడు. వార్నర్ ఒక్కడే కాకుండా ఫ్యామిలీ మొత్తం కూడా అతనితో కాలు కదపడం మరో విశేషం. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ డేవిడ్ వార్నర్‌ను వదిలేసినప్పుడు తెలుగు అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. సన్‌రైజర్స్‌ను వదిలి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారినా వార్నర్ మాత్రం తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేదు

తెలుగు సినిమాలను ఫాలో అవుతూ.. స్పూఫ్ వీడియోలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా భీష్మ సినిమాలో ఓ సాంగ్‌ను స్పూఫ్ చేశాడు. విచిత్రం ఏంటంటే ఎప్పుడూ హీరోల ముఖాలకు తన ఫేస్ పెట్టి స్పూఫ్ చేసే వార్నర్.. ఈ సారి రష్మిక మందనా ఫేస్‌ను తన ముఖంగా మార్చాడు. దాంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమాలో ‘వాటే

బ్యూటీ’పాటలోని.. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు’ అనే లిరిక్స్‌ను ఎడిట్ చేశాడు. రష్మిక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కగా.. డేవిడ్ వార్నర్ ఎకసెక్కాలు మాములుగా లేవు కదా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక అంతకుముందు డీజే టీల్లు సినిమాకు సంబంధించిన వీడియో స్పూఫ్‌ను షేర్ చేశాడు.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ చాలా దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం నాలుగు మ్యాచులు ఆడిన అతను కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు. వార్నర్ వైఫల్యంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడంపై వార్నర్ హింట్ ఇచ్చాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh