Umesh Yadav : టీమిండియా క్రికెటర్ ఇంట విషాదం

indian cricketr umesh yadav lost father

Umesh Yadav : టీమిండియా క్రికెటర్ ఇంట విషాదం

 

టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి తిలక్ యాదవ్.

ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఖపర్ఖేడాలోని మిలన్ చౌక్‌లోని అతని ఇంటికి తీసుకువచ్చారు.

అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉమేష్ తండ్రి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు.

ఆయన వయసు 74 సంవత్సరాలు. ప్రొఫెషనల్ రెజ్లర్ అయిన తిలక్ యాదవ్. వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌ లోనూ పనిచేశారు.

ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్‌కు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. అయితే అతను తన కొడుకు ఉమేష్‌ను పోలీసు లేదా ఆర్మీలో చేర్పించాలనుకున్నాడు.

అయితే, ఉమేష్ ముందు రంజీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అందులో నుంచి ఉమేష్‌కు భారత జట్టులో అవకాశం దక్కింది.

 

 

 

 

కాబట్టి, 2010లో ఐపీఎల్‌లో అతని కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్ వేలం వేసింది. నవంబర్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో యాదవ్ అరంగేట్రం చేశాడు.

విదర్భ తరఫున టెస్టులు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. తిలక్ యాదవ్ వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాకు చెందినవాడు.

తిలక్‌కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు(ఉమేష్) ఉన్నారు. బొగ్గు గనిలో ఉద్యోగం రావడంతో నాగ్‌పూర్‌ సమీపంలోని ఖపర్‌ఖేడీకి వచ్చి జీవనం ప్రారంభించాడు.

మొదట్లో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. తిలక్ యాదవ్ మృతితో ఉమేశ్ యాదవ్ కుటుంబం లో విషాదం ఛాయలు అలుముకున్నాయి .

విషయం తెలిసిన టీమిండియా క్రికెటర్లు, అభిమానులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

2011లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్  ఇప్పటి వరకు 54 టెస్టులు ఆడాడు. అయితే తరచూ జట్టులోకి వచ్చి పోతున్నాడు.

 

 

 

చివరిసారి గతేడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌తో మీర్పూర్‌లో జరిగిన టెస్టులో ఆడాడు. అలాగే, 75 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. వన్డేల్లో 79 వికెట్లు తీసుకున్నాడు. 2015 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. అయితే, 2018 తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. 2022 టీ20 ప్రపంచకప్‌కు ముందు టీ20ల్లోకి తిరిగి వచ్చాడు.

ప్రస్తుతం  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్‌కు ఉమేశ్ యాదవ్ ఎంపికైనప్పటికీ తొలి రెండు టెస్టుల్లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

అయితే రెండో టెస్టు ముగిసిన వెంటనే ఇంటికి చేరుకున్నాడు. ఆసీస్‌తో మార్చి 1న ఇండోర్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంతో సెలక్షన్‌కు ఉమేశ్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉమేశ్ యాదవ్‌తో పోలిస్తే మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలకే ఎక్కువ చాన్స్ ఉంది.

మూడో టెస్టులో కనుక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటే అప్పుడు భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది.

అదే జరిగితే మూడో టెస్టులోనే ఉమేశ్ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh