కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ సుదీర్ఘ సమావేశం

telangana kcr met with ministers kt

కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ సుదీర్ఘ సమావేశం

తెలంగాణ మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావు తమ రోజువారి కార్యకలాపాలను రద్దు చేసుకుని మరీ సీఎం కేసీఆర్ తో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమావేశం అయ్యారు. మంత్రి హరీష్ రావు తన ఆదిలాబాద్ జిల్లా పర్యటనను రద్దు చేసుకుని మరీ ప్రగతి భవన్ కు వచ్చినట్టు సమాచారం. ఇక మరోవైపు మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా చందనపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొని  ఆపై నేరుగా ప్రగతిభవన్ కి వచ్చి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేటీఅయితే ఇప్పుడు  సమావేశం కావడం పార్టీలోనూ ఇతర రాజకీయ వర్గాలలోను ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇంతకీ నాలుగు గంటల పాటు సాగిన సుదీర్ఘ మంతనాలలో ఏం చర్చించారు? కెసిఆర్ ఏం చేయబోతున్నారు? అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ విస్తరణ కోసం అచిచూసి అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా తమకు పట్టున్న రాష్ట్రాల్లో మొదట క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి,  అలాగే వచ్చే ఎన్నికలలో హ్యాట్రిక్ విజయాన్ని బిఆర్ఎస్ ఖాతాలో వేయడానికి కెసిఆర్ మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు.  ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు ఏ విధంగా సాగుతున్నాయి . వచ్చే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి  జాతీయస్థాయిలో పార్టీని ముందుకు తీసుకు వెళ్ళడానికి ఏం చేయాలి? వంటి అనేక అంశాల పైన మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు సీఎం కేసీఆర్ .ఈ  భేటీ నేపథ్యంలో ఆర్ మరియు హరీష్ రావులు నాలుగు గంటల పాటు కేసీఆర్ తో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల విది విదానాలు ఏ విధంగా ఉన్నాయి? పాదయాత్రలు చేస్తున్న పార్టీలకి, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్న పార్టీలకు ప్రజలలో మద్దతు ఏ విధంగా వస్తుంది? వంటి విషయాలను తెలుసుకున్న కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఏం చేస్తున్నారు అన్న దానిపై కూడా కెసిఆర్ మంత్రులను ఆరా తీశారు అని సమాచారం. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండేలాగా ప్రణాళికలు అమలు చేయాలని కేసీఆర్ సూచించారు.  జిల్లాలలో ఇంకా ప్రారంభం కాని కలెక్టరేట్లకు ముహూర్తాలు పెట్టుకోవాలని, ఇక ఆయా నియోజకవర్గాలలో పూర్తి చేసిన పనులపై విస్తృత ప్రచారం చేసుకునేలాగా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయాలని కేసిఆర్ మంత్రులకు సూచించారు. వచ్చే ఎన్నికలకు క్షేత్రస్థాయిలోకి పార్టీ వెళ్లడానికి కావలసిన వ్యూహాలను రచించి వాటిని అమలు చేయాలని కెసిఆర్ సూచించారు. రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల దూకుడుకు లో  బిఆర్ఎస్ వెనుకబడి పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఇద్దరు మంత్రులకు సూచించినట్టు సమాచారం.

అలాగే జాతీయస్థాయిలోను బిఆర్ఎస్ పార్టీని విస్తరించే వ్యూహాల పైన కెసిఆర్ మంత్రులతో చర్చించినట్లు సమాచారం.తరువాత  ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళనున్నారని, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి జాతీయ మీడియాతో మాట్లాడనున్నారని సమాచారం. ఇక జాతీయ స్థాయిలో పార్టీ వైపు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీ నాయకులను ఉద్దేశించి కూడా ముగ్గురి మధ్య భేటీలో కీలక చర్చ జరిగిందని తెలుస్తుంది. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ ఒక పక్క రాష్ట్ర స్థాయిలో ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడంతో పాటు, మరోపక్క జాతీయ స్థాయిలో బి ఆర్ ఎస్ విస్తరణ ప్రణాళికలు వేస్తూ దూసుకుపోతున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh