Ttd Subhakruth panchangam Release :శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ టీటీడీ పంచాంగం విడుదల
టీటీడీ ముద్రించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఈవో ధర్మారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ప్రతి సంవత్సరం లాగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర పంచాగం ముద్రించినట్లు చెప్పారు. బుధవారం నుంచి తిరుమలలో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చని అన్నారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో మార్చి రెండో వారం నుంచి అందుబాటులో ఉంచుతామని అన్నారు. మరోవైపు తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించినారు. శ్రీమలయప్పస్వామి వారి చూసిన భక్తులు ఆనందంతో పరవసించిపోయారు.
. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. కుమారధార తీర్థ ముక్కోటికి వచ్చిన భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగా తీర్థానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకుల సహకారంతో ఉదయం అల్పాహారము, పాలు, మధ్యాహ్నం సాంబారు అన్నం, మజ్జిగ అన్నం, పులిహోర, మజ్జిగ, సాయంత్రం ఉప్మా, కిచిడి, తాగునీరు అందించారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్, అటవీ విభాగాలు సమన్వయంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనప సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించారు.
ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ప్రాశస్త్యం వరాహ, మార్కండేయ పురాణాల ప్రాకారం ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమర ధార’ అనే పేరు వచ్చింది. పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థ్లంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందడు. సాక్షత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.
ఇది కూడా చదవండి :