TTD ఛైర్మన్ గా TV5 ఛైర్మన్
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో టిటిడీ ఛైర్మన్ పదవి నియామకం గురించి చర్చాoశనీయంగా మారింది .
2024 అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన సంగతి తెలిసిందే . దాంతో ఆంధ్రప్రదేశ్ సిఎం గా నారా చంద్ర బాబు నాయుడు పదవి భాద్యతలను చేపట్టారు .
ఇక అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం లో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిఎం గా ఉన్నారు .
కానీ జూన్ 4 వ తేదీన విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం విజయం సాధించడం తో ఆంధ్రప్రదేశ్ సిఎం గా నారా చంద్రబాబు నాయుడు నియమితులయ్యారు .
వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి పాలవడంతో ఇక అప్పటి వరకు టిటిడీ ఛైర్మన్ గా ఉన్న భూమన కరుణకుమార్ తన పదవికి రాజీనామా చేశారు .
దాంతో అప్పటి నుంచి టిటిడీ నూతన ఛైర్మన్ ను నియమించే భాద్యత ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్ర బాబు నాయుడు మీద పడింది .
అయితే ఈ పదవికి చాలా మంది పోటీ పడిన సంగతి తెలిసిందే . అంతే కాక చాలా మంది పేర్లు కూడా బయటికి వచ్చాయి . ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సిఎం .
కొణిదెల పవన్ కళ్యాణ్ సోదరుడు అయిన కొణిదెల నాగబాబును టిటిడీ ఛైర్మన్ గా నియమిస్తున్నట్లు వార్తలు వినిపించాయి .
అయితే ఈ వార్తలు నిజం కాదని నాగబాబు నే స్వయంగా చెప్పడం తో నిజం తెలిసింది. అంతే కాకుండా మరికొంత మంది పేర్లు కూడా వినిపించాయి .
వారిలో అశోక్ గజపతి రాజు , రఘు రామ కృష్ణ రాజు ఇలా పలువురి పేర్లు వినిపించాయి . కానీ అప్పటికి టిటిడీ ఛైర్మన్ గా ఎవరిని నియామిస్తారనేది మాత్రం వ్యక్తం అవ్వలేదు .
అయితే ఇప్పుడు తాజాగా టిటిడీ ఛైర్మన్ గా టీవి5 ఛైర్మన్ బిఆర్ . నాయుడు ని నియమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి .
నేడో రేపో ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్ర బాబు నాయుడు ఈ విషయం పై అధికారక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది .
మరి చూడాలి ఇప్పటికైనా టిటిడీ ఛైర్మన్ నియామకం పూర్తవుతుందా లేదా అనేది .