ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాజ్‌పూర్ కొరై స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో స్టేషన్ భవనం దెబ్బతిన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రెస్క్యూ టీం, రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగెత్తిందని, వెయిటింగ్ రూమ్‌ను ఢీకొట్టి, ఆపై తన మార్గంలో కొనసాగిందని అతను చెప్పాడు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకారం, వెయిటింగ్ రూమ్‌లో ఇద్దరు ప్రయాణికులు మరణించారు.
గూడ్స్ రైలు.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఘటనలో 10 బోగీలు బోల్తాపడినట్లు అధికారులు తెలిపారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయని.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బోగీల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
Odisha| 2 died after a goods train derailed today early morning at Korai Station, under East Coast Railway. Both rail lines were blocked, station building damaged. Relief teams, Railway officials rushed to the site. Rescue operation underway: East Coast Railway
— ANI (@ANI) November 21, 2022