శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం చేయాలనుకుంటే తప్పనిసరిగా అవి ఉండవలసిందే….
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్య వేలాది భక్తులు తిరుపతికి వెళ్తుంటారు. ఆలయంలో శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు పలు రకాల సేవల్లోనూ కూడా పాల్గొంటారు. వీటికి ప్రతినెలా టీటీడీ ఆన్‌లైన్ వేదికగా టికెట్లను విడుదల చేస్తుంది. అలాగే శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లోనే కేటాయిస్తారు. ఈ టికెట్లు పొందిన వారికి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం చేసే అవకాశం దొరుకుతుంది. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్లను రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంచారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31 వరకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్లు ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లేదా tt Devasthanam యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజూ 700 మందికి అంగప్రదక్షిణ చేసే అవకాశం లభిస్తుంది. ఈ టికెట్లు పొందిన వారు రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో మూడు మునకలు వేసి. తడి బట్టలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా లోపలికి వెళ్లాలి. రిపోర్టింగ్ సమయం రాత్రి ఒంటి గంట కాబట్టి ఆ సమయానికే క్యూలైన్‌లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మరి ఎంట్రీ వద్ద బుకింగ్ టికెట్, ఐడిని చెక్ చేసిన తర్వాత భక్తులను ఆలయం లోపలి అనుమతిస్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వెయిటింగ్ హాల్లోకి పంపిస్తారు.
శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత. భక్తులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. తెల్లవారుఝామున 2: 45 గంటలకు మొదట స్త్రీలను, ఆ తర్వాత పురుషులకు అనుమతి ఉంటుంది. సుప్రభాత సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది. వారి ప్రదక్షిణ పూర్తయి వెండి వాకిలి వద్దకువెళ్లాక. పురుషులను అంగప్రదక్షిణకు అనుమతి ఉంటుంది.
స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని.శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేరుకోవాలి. ప్రదక్షిణలు చేసే వారికి శ్రీవారి సేవకులు సాయం చేస్తారు. అంగప్రదక్షిణ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం, ఒక ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు. అంగప్రదక్షిణ చేసే భక్తులుమాత్రం తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలే ధరించాలి. స్త్రీలు చీరలు, లంగా వోణీ వంటివి ధరించాలి. పురుషులు పంచె, కండువా ధరించాలి. షార్ట్, ట్రాక్ ప్యాంట్, టీషర్ట్, షర్ట్, జీన్స్ ప్యాంట్ వంటి దుస్తులను ధరిస్తే మాత్రం అంగప్రదక్షిణ అనుమతించారు.
ఇది కూడా చదవండి :