Thirumala: శ్రీవారికి భక్తుడి భారీ విరాళం ఎంతంటే ?

Thirumala

Thirumala thirupathi:తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం ఎంతంటే ?

Thirumala శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఆర్‌సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏవీకే ప్రసాద్, ఏవీ ఆంజనేయ ప్రసాద్ రూ. కోటిరూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ డీడీని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ విరాళాన్ని ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అందజేశారు ప్రసాద్, ఆంజేనయ ప్రసాద్. మరోవైపు అనంతపురంకు చెందిన శ్రీధర్ దంపతులు టీటీడీ వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ 10,11,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డీడీని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ధర్మా రెడ్డికి అందజేశారు.

మరోవైపు Thirumala లో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం 66,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.Thirumala లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తుల స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. వీకెండ్‌తో పాటూ విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావడంతో రద్దీ పెరిగింది.

అలాగే తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు ప్రాజెక్టు పనుల పురోగతిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి బుధవారం టీటీడీ పరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మే 31 నాటికి ప్రాజెక్టు మొత్తం పనులు పూర్తి చేసి జూన్ 15వ తేదీ నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరారు ఈవో. రోడ్ల మధ్యలో మీడియన్స్ అభివృద్ధి కోసం అవసరమైన స్థలాన్ని వెంటనే కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద గ్రిడ్డర్స్ పనులను త్వరగా చేపట్టాలని కోరారు. ప్రస్తుతం పూర్తయిన 92 శాతం పనుల పురోగతిని వచ్చే బోర్డు సమావేశంలో తెలిపేందుకు వీలుగా సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు.

Thirumala లో ఇదిలా ఉంటే.. టీటీడీ ఆధ్వర్యంలోని నరసింగాపురంలో గల ఆయుర్వేద ఫార్మశీలో ఔషధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని జేఈవో సదా భార్గవి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతిగృహంలో గురువారం ఆయుర్వేద ఫార్మశీపై సమీక్ష నిర్వహించారు. ఫార్మశీని బలోపేతం చేసేందుకు మూడు ఇండస్ట్రియల్‌ షెడ్లు నిర్మించామని, త్వరలో వీటిని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రూ.3.50 కోట్లతో ఔషధాల తయారీ యంత్రాల కొనుగోలుకు అనుమతి ఇచ్చామని, 75 శాతం యంత్రాల ఏర్పాటు జరిగిందని తెలిపారు జేఈవో. మొత్తం 314 రకాల ఫార్ములాలకు ఆయుష్‌ శాఖ నుండి అనుమతి లభించిందని, వీటిలో 60 రకాల మందులు మొదటి దశలో ఉత్పత్తి చేసి రోగులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. తులసివనాల తరహాలో ఫార్మశీ ఆవరణలో ఔషధ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. డిఎఫ్‌ఓ ఆధ్వర్యంలో టిటిడికి చెందిన బ్రాహ్మణపట్టు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, కల్యాణి డ్యామ్‌, నరసింగాపురం, ఇతర టీటీడీ నర్సరీల్లో ఔషధ మొక్కలు పెంచాలన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh