IPL: భారీ స్కోర్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్

IPL

IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  2023  లో ఈ రోజు 19వ మ్యాచ్లో నితీష్ రాణా సారథ్యంలోని కోల్కతా నైట్రైడర్స్, ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో తలపడుతున్నాయి. రెండు ఓటములు చవిచూసిన హైదరాబాద్ గత మ్యాచ్లో ఖాతా తెరిచింది. ఆ విజయ పరంపరని కొనసాగించడం కోసం ఈ రోజు హైదరాబాద్ జటు భారీ స్కోర్ చేసింది. హైదరాబాద్ జటు 20 ఓవర్లకు 228 పరగులు చేసి భారీ స్కోర్ ను కోల్కతా నైట్రైడర్స్ ముందు ఉంచారు.  కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బౌలర్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనింగ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ ఆధిపత్యం చెలాయించాడు. దీంతో హైదరాబాద్ జటు 228 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ హ్యారీ బ్రూక్  55 బంతుల్లో, 12 ఫోర్లు, మూడు సిక్సర్లు తో 100 పరుగులు కొట్టి నాటౌట్ గా నిలిచాడు. దాంతో IPL 2023 సీజన్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. అలాగే ఈ IPL సీజన్‌లో హ్యారీ బ్రూక్‌దే మొదటి సెంచరీ కావడం విశేషం. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 26 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు తో 50 పరగులు చేశారు.

సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రెండుసార్లు ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్లో వచ్చే మంచు పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించామని, దీంతో ఛేజింగ్ మరింత సులభమవుతుందని కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా తెలిపాడు. మరి హైదరాబాద్  చేసిన భారీ స్కోర్ ను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.

సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్

కోల్కతా నైట్రైడర్స్: రహ్మతుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఎన్ జగదీశన్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh